కేన్ విలియమ్సన్ కి గాయంపై.. బాబర్ ఎమన్నాడంటే?
ఐపీఎల్ లో గుజరాత్ టైటాన్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు విలియంసన్. ఇక మొదటి మ్యాచ్ లో భాగంగా గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో భాగంగా గుజరాత్ విజయం సాధించింది అని చెప్పాలి. అయితే మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఫీల్డింగ్ చేస్తూ గాయపడ్డాడు. అయితే అతని గాయం తీవ్రత చిన్నదే అయి ఉంటుందని అందరూ అనుకున్నారు. కానీ మోకాలికి సర్జరీ అవసరమని అటు వైద్యులు సూచించినట్లు తెలుస్తోంది. ఒకవేళ సర్జరీ చేయించుకుంటే ఇక అతను భారత్ వేదికగా వేదికగా జరిగే వన్డే వరల్డ్ కప్ కి కూడా దూరంగా ఉంటాడు అని చెప్పాలి.
ఇక అతని గాయంతో అభిమానులు అందరూ కూడా షాక్ లో మునిగిపోయారు. కెప్టెన్ గా ఉన్న విలియమ్సన్ దూరమైతే న్యూజిలాండ్ పరిస్థితి ఏంటి అని ఆందోళనలో మునిగిపోయారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇక ఇటీవల గాయం బారిన పడిన విలియంసన్ పై పాకిస్తాన్ ప్లేయర్ బాబర్ అజాం సోషల్ మీడియా వేదిక స్పందించాడు. కేఎన్ విలియమ్స్ మీరు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్న అంటూ పోస్ట్ పెట్టాడు. దీనిపైన నేటిజన్స్ స్పందిస్తూ కోహ్లీ పేలవమైన ఫామ్ లో ఉన్నప్పుడు మద్దతు పలికిన బాబర్.. ఇప్పుడు విలియంసన్ గాయం సమయంలో కూడా ఉత్సాహం నింపేందుకు ప్రయత్నించాడు అంటూ చర్చించుకుంటున్నారు.