ఐపీఎల్ లో.. చీర్ గర్ల్స్ జీతాలు ఎంతో తెలుసా?
ఇక తమ జటు ప్లేయర్లు వికెట్ సాధించినప్పుడు లేదా బౌండరీలు బాదినపుడు చీల్ గర్ల్స్ తమ డాన్స్ తో అభిమానులు అందరిలో కూడా జోష్ నింపుతూ ఉంటారు అని చెప్పాలి. ఇక ఇలా అభిమానుల్లో జోష్ నింపేందుకు ఎంతో అందంగా ఉండే చీర్ గర్ల్స్ ని ఎంపిక చేస్తూ ఉంటాయి ఆయా జట్ల యాజమాన్యాలు. అయితే ఇక ఐపీఎల్ లో ఉండే ఆటగాళ్లకు అయితే టోర్నీలో ఆడటం ద్వారా కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది అని తెలుసు. కానీ ఇలా ప్రతి మ్యాచ్ లో కనిపిస్తూ అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపే చీర్ గర్ల్స్ వేతనం ఎంత ఉంటుంది అన్నది మాత్రం చాలా మందికి తెలియదు.
ఈ క్రమంలోనే వారికి ఎంత మొత్తంలో చెల్లిస్తారు అనే విషయాన్ని ఒక మీడియా సంస్థ వెల్లడించింది. మ్యాచ్ ల వారిగానే వారికి జీతాలు ఇస్తూ ఉంటారట. కోల్కతా అత్యధికంగా చీర్ గర్ల్స్ కి 25000 చెల్లిస్తుందట. ఇక ముంబై ఇండియన్స్ ఆర్సీబీలు 20000 మిగతా జట్లన్నీ సగటున ఒక్కో మ్యాచ్ కి 12000 ఇస్తారట. ఒకవేళ జట్టు విజయం సాధిస్తే ఇక చీర్ గర్ల్స్ బోనస్ కూడా ఉంటుందట. అదనంగా అటు స్టార్ హోటల్లో వసతి, ఫుడ్ కూడా లభిస్తాయి అన్నది తెలుస్తుంది.