అతన్ని పక్కన పెట్టి.. సెలెక్టర్లు తప్పు చేస్తున్నారు : హర్భజన్

praveen
భారత క్రికెట్లో సీనియర్ గా కొనసాగుతున్న శిఖర్ ధావన్ కు గత కొంతకాలం నుంచి భారత జట్టులో చోటు లేకుండా పోయింది అన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే టీ20,  టెస్ట్ ఫార్మట్లా నుంచి అతన్ని పక్కన పెట్టేసిన బీసీసీఐ సెలెక్టర్లు.. కేవలం వన్డే ఫార్మాట్లో మాత్రమే అతని సెలెక్ట్ చేస్తూ వస్తున్నారు. ఇక రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ అందుబాటులో లేని ప్రతిసారి అతనికి వన్డే జట్టు కెప్టెన్సీ బాధ్యతలను కూడా అప్పగించారు. ఇక అతనిపై బీసీసీఐ సెలక్టర్లు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఒక ఆటగాడిగా కెప్టెన్గా కూడా జట్టుకు మంచి సేవలు చేశాడు శిఖర్ ధావన్.

 అలాంటి శిఖర్ ధావన్ ను గత కొంతకాలం నుంచి సెలెక్టర్లు వన్డే ఫార్మాట్ కూడా సెలక్ట్ చేయడం లేదు అని చెప్పాలి. దీంతో భారత జట్టులో కనిపించకుండా పోయాడు శిఖర్ ధావన్. ఒకప్పుడు ధావన్ కచ్చితంగా వన్డే వరల్డ్ కప్ జట్టులో ఉంటాడని అందరూ నమ్మకం పెట్టుకున్నారు. కానీ ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే అతనికి వరల్డ్ కప్ జట్టులో ఛాన్స్ దక్కుతుందా లేదా అని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఐపీఎల్ లో రాణించి మళ్లీ టీమిండియాలోకి రావాలనుకుంటున్న శిఖర్ ధావన్ మంచి ప్రదర్శన చేస్తున్నాడు అని చెప్పాలి.

 అయితే ఎంతో అనుభవం ఉన్న శిఖర్ ధావన్ ను గత కొంత కాలం నుంచి టీమిండియా సెలెక్టర్లు వన్డే జట్టుకు ఎంపిక చేయకుండా పక్కన పెట్టడంపై భారత మాజీ స్పిన్నర్ హార్భజన్ సింగ్ అసహనం వ్యక్తం చేశాడు. శిఖర్ ధావన్ విషయంలో బీసీసీఐ సెలెక్టర్లు వ్యవహరిస్తున్న తీరు సరి కాదంటూ అభిప్రాయపడ్డాడు. అతను గొప్పగా రాణిస్తున్న ఎందుకు పక్కన పెట్టారని ప్రశ్నించాడు. ఫిట్నెస్ విషయంలో కోహ్లీ ఎంత ఫిట్ గా ఉంటాడో ధావన్ అంతే ఫిట్ గా ఉంటాడని చెప్పుకొచ్చాడు హర్భజన్. ఇక ఇటీవల రాజస్థాన్ తో జరిగిన మ్యాచ్లో ధావన్ 86 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో ఇక హర్భజన్ ఈ వ్యాఖ్యలు చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: