వారెవ్వా.. చాహల్ అరుదైన రికార్డ్?

praveen
ఐపీఎల్ హడావిడి మొదలైంది . ప్రతి మ్యాచ్ కూడా ఎంతో ఉత్కంఠ భరితంగా సాగుతుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఎప్పటిలాగానే ఎంతోమంది స్టార్ ప్లేయర్లు ఐపీఎల్లో రికార్డులో వేట ప్రారంభించారు. అద్భుతమైన ఇన్నింగ్స్ లు ఆడుతూ అదరగొడుతున్నారు అని చెప్పాలి. దీంతో తమ అభిమాన ఆటగాళ్ల ప్రదర్శన చూసి ఫ్రాన్స్ అందరు కూడా సంతోషంలో మునిగిపోతూ ఉన్నారు. కాగా ఐపీఎల్లో ఇప్పటికే అత్యుత్తమమైన బౌలర్గా పేరు సంపాదించుకున్నాడు టీమ్ ఇండియా స్టార్ బౌలర్ యుజ్వేంద్ర చాహల్.

 సరైన సమయంలో సరైన బంతులను సంధిస్తూ ఇక వికెట్లను పడగొట్టి జట్టును విజయతీరాల వైపుకు నడిపిస్తూ ఉంటాడు అని చెప్పాలి. అయితే గతంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తరుపున కొనసాగుతూ ఎన్నో మంచి ప్రదర్శనలు చేశారు. కానీ ఆ తర్వాత జరిగిన మెగా వేలంలో మాత్రం రాజస్థాన్ రాయల్స్ జట్టులోకి వెళ్ళాడు అని చెప్పాలి. దీంతో ఆ జట్టు తరుపున కూడా తన ప్రదర్శనను అదే రీతిలో కొనసాగిస్తూ ఉన్నాడు. తన స్పిన్ బౌలింగ్ తో మ్యాజిక్ చేస్తూ అదరగొడుతూ ఉన్నాడు అని చెప్పాలి. ఇక ఇటీవల రాజస్థాన్ రాయల్స్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు మధ్య జరిగిన మ్యాచ్లో మరోసారి చాలా సత్తా చాటాడు.

 సన్రైజర్స్ హైదరాబాద్ పై తన స్పిన్ బౌలింగ్ తో మ్యాజిక్ చేసిన చాహల్ ఏకంగా నాలుగు వికెట్లు పడగొట్టాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఐపిఎల్ హిస్టరీలో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్గా నిలిచాడు. ఇప్పటివరకు చాహల్ 170 వికెట్లు తీశాడు అని చెప్పాలి. చాహల్ తర్వాత అమిత్ మిశ్రా 167 వికెట్లతో రెండవ స్థానంలో ఉన్నాడు. పియూష్ చావ్లా 157 వికెట్లతో మూడో స్థానంలో ఉండడం గమనార్హం. మొత్తంగా చూసుకుంటే 183 వికెట్లతో బ్రావో ఐపీఎల్ హిస్టరీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా నిలిచాడు అని చెప్పాలి. కాగా రాజస్థాన్ రాయల్స్ చేతిలో భువనేశ్వర్ కెప్టెన్సీ లో బరిలోకి దిగిన సన్రైజర్స్ చిత్తుగా ఓడిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: