ఆస్ట్రేలియా జట్టుకు.. ఒక బ్యాడ్ న్యూస్.. ఒక గుడ్ న్యూస్?

praveen
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ప్రస్తుతం ఆస్ట్రేలియా జట్టు భారత పర్యటనకు వచ్చింది అన్న విషయం తెలిసిందే.. అయితే అటు ఆస్ట్రేలియా జట్టు ప్రపంచ క్రికెట్లో ఒక పటిష్టమైన జట్టుగా కొనసాగుతున్నప్పటికీ అటు భారత పర్యటనలో మాత్రం పెద్దగా ఆకట్టుకునే ప్రదర్శన చేయలేక పోతుంది. అయితే నాలుగు మ్యాచ్ ల టెస్టు సిరీస్ లో భాగంగా ఇప్పటికే రెండు మ్యాచ్లు ముగిసాయి. అయితే ఈ రెండు మ్యాచ్లలో కూడా విజయం సాధించింది అని చెప్పాలి. అటు గెలిచేందుకు ప్రత్యర్థి ఆస్ట్రేలియాకు ఎక్కడ అవకాశం ఇవ్వలేదు.

 అయితే ఇప్పటికే ఇలా వరుస ఓటములతో సతమతమవుతున్న ఆస్ట్రేలియా జట్టుకు అటు గాయాల బెడద కూడా తీవ్రంగా వేధిస్తుంది అని చెప్పాలి. ఇప్పటికే గాయం బారిన పడి రెండు టెస్టులకు దూరమైన ఆటగాళ్ళు ఇక పూర్తిగా సిరీస్ కు దూరమయ్యే అవకాశం ఉంది అన్న వార్త మాత్రం ఏకంగా ఆస్ట్రేలియా వ్యూహాలను మొత్తం దెబ్బతీస్తూ ఉంది అని చెప్పాలి. ప్రస్తుతం ఆస్ట్రేలియా జట్టులో స్టార్ ప్లేయర్ గా కొనసాగుతున్నాడు జోష్ హెజిల్ వుడ్. తన బౌలింగ్ తో ప్రత్యర్ధులను ముచ్చేమటలు పట్టిస్తూ ఉన్నాడు అని చెప్పాలి. అలాంటి స్టార్ బౌలర్ ఇక ఇప్పుడు మొత్తం ఆస్ట్రేలియా జట్టుకు దూరం కాబోతున్నాడు అన్నది తెలుస్తుంది.

 ప్రస్తుతం గాయం బారిన పడి కోలుకుంటున్న హెజిల్ వుడ్  ఇక మూడవ టెస్ట్ నుంచి జట్టుకు అందుబాటులోకి వస్తాడని అందరూ అనుకున్నారు. కానీ ఇక ఇప్పుడు భారత్తో జరగబోయే టెస్ట్ సిరీస్ మొత్తానికి అతను దూరమయ్యాడు. గాయం నుంచి ఇంకా అతను పూర్తిగా కోలుకోలేదు అన్నది తెలుస్తుంది. దీంతో మిగతా టెస్టులకు కూడా హెజిల్ వుడ్ అందుబాటులో ఉండబోడు అని ఆస్ట్రేలియా హెడ్ కోచ్ ఆండ్రూ మెక్ డోనాల్డ్ తెలిపాడు. అయితే ఇది ఒక చేదువార్త అయినప్పటికీ మొదటి రెండు టెస్ట్ మ్యాచ్లకు దూరమైన స్టార్క్, గ్రీన్ మూడో టెస్ట్ మ్యాచ్లో మాత్రం అందుబాటులోకి వచ్చే ఛాన్స్ ఉందట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: