
కళ్ళు చెదిరే క్యాచ్.. హార్థిక్ పాండ్యా షాక్?
అంతకుముందు జరిగిన రెండు మ్యాచ్లలో కూడా అంతంత మాత్రం గానే ప్రదర్శన చేసిన సూర్య కుమార్ యాదవ్.. మూడవ టి20 మ్యాచ్లో సెంచరీ తో చెలరేగిపోయాడు. అయితే ఫీల్డింగ్ లో కూడా ఇలాంటి స్టన్నింగ్ క్యాచ్ ఒకటి భారత యువ ఆటగాడు శివమ్ మావి పట్టి అందరిని ఆశ్చర్యపరిచారు అని చెప్పాలి. శ్రీలంక ఇన్నింగ్స్ 10వ ఓవర్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. చాహల్ వేసిన ఫుల్ ఆఫ్ సైడ్ బంతిని అసలంక భారీ షాట్ ఆడాడు. బంతి వేగంగా దూసుకుపోవడంతో బౌండరీ దాటడం ఖాయం అని అందరూ భావించారు. అయితే అదే సమయంలో స్వీపర్ కవర్లో ఫీల్డింగ్ చేస్తున్నాడు శివమ్ మావి.
అయితే బంతిని క్యాచ్ పట్టుకునేందుకు ఎంతో దూరం నుంచి వేగంగా పరిగెత్తుకుంటూ వచ్చి బౌండరీ లైన్ వద్ద బ్యాలెన్స్ కోల్పోకుండా ఎంతో అద్భుతంగా క్యాచ్ ఒడిసిపట్టాడు. ఇక అతను అద్భుతమైన క్యాచ్ కి అందరూ ఫిదా అయిపోయారు అని చెప్పాలి. కెప్టెన్ హార్దిక్ పాండ్యా సైతం శివమ్ మావి మెరుపు క్యాచ్ చూసి ఆశ్చర్యలో మునిగిపోయాడు. ఈ క్రమంలోనే అతన్ని ప్రశంసలు కురిపించాడు. ఇక ఇందుకు సంబంధించిన వీడియోని బీసీసీఐ ట్విట్టర్ వేదికగా షేర్ చేయడంతో ప్రస్తుతం ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. కాగా ఈ మ్యాచ్ లో భాగంగా భారత జట్టు 91 పరుగుల భారీ తేడాతో విజయం సాధించి సిరీస్ కైవసం చేసుకుంది.