ఏడాది నా టార్గెట్ ఒక్కటే : నీరజ్ చోప్రా

praveen
ఎన్నో ఏళ్ల భారత ప్రజల నిరీక్షణకు తెరదింపుతూ ఏకంగా గోల్డ్ మెడల్ సాధించి పెట్టాడు నీరజ్ చోప్రా. జావలిన్ త్రో విభాగంలో బంగారు పతకాన్ని సాధించి ఇక విశ్వవేదికపై త్రివర్ణ పతాకం రెపరెపలాడేలా చేశాడు అన్న విషయం తెలిసిందే. అయితే అప్పటి వరకు ఎవరికీ తెలియని చోప్రా బంగారు పతకం సాధించిన తర్వాత మాత్రం ఇక ఇండియా వ్యాప్తంగా సూపర్ స్టార్ గా మారిపోయాడు అని చెప్పాలి. ఒక్కసారిగా సెలబ్రిటీ హోదాను సంపాదించుకున్నాడు అని చెప్పాలి. ఇక ఆ తర్వాత సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా నీరజ్ చోప్రా దర్శనమిచ్చాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.



 అయితే కేవలం ఒలంపిక్స్ లో గోల్డ్ మెడల్స్ సాధించడమే కాదు ఆ తర్వాత జరిగిన అన్ని పోటీలలో కూడా తనదైన రీతిలో సత్తా చాటుతూ మెడల్స్ ప్రభంజనాన్ని కొనసాగిస్తూనే వచ్చాడు. అయితే ఒలంపిక్స్ తర్వాత మీ లక్ష్యం ఏంటి అని అడగగా జావలిన్ త్రో విభాగంలో 90 మీటర్ల దూరం బళ్ళాన్ని విసిరి.. ఇక రికార్డు సృష్టించడమే తన లక్ష్యం అంటూ చెప్పుకుచాడు నీరజ్ చోప్రా. అయితే ఇప్పటివరకు ఈ రికార్డు సాధించడమే లక్ష్యంగా ఇక ప్రతి టోర్నమెంట్లో కూడా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు అని చెప్పాలి. అయితే డైమండ్ లీగ్ లో ఏకంగా 89.94 మీటర్లు బల్లెం విసిరాడు. అతని లక్ష్యానికి ఆరు సెంటి మీటర్ల దూరంలో ఆగిపోయాడు.


 ఈ క్రమంలోనే ఇటీవల ఇదే విషయంపై మాట్లాడాడు నీరాజ్ చోప్రా. తన దృష్టి అంతా కూడా 90 మీటర్ల దూరానికి జావలిన్ త్రో చేయడం పైనే ఉంది అంటూ నీరాజ్ చోప్రా చెప్పుకొచ్చాడు. అయితే ఇక ఈ ఏడాది తప్పకుండా తన లక్ష్యాన్ని సాధిస్తాను అంటూ ధీమా వ్యక్తం చేశాడు. డైమండ్ లీగ్ లోనే ఇక ఈ ఫీట్ సాధించి ఉండేవాడినని.. కానీ కేవలం కొన్ని సెంటీమీటర్ల ముందుకు వెళ్లి ఉంటే అది సాధ్యమయ్యేది అంటూ నిరాజ్ చోప్రా చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలోనే అతను తప్పకుండా 90 మీటర్ల రికార్డు సాధిస్తాడని అభిమానులు ఆల్ ద బెస్ట్ చెప్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: