దురంధర్ మూవీ కలెక్షన్స్ పై ఆమిర్ ఖాన్ కామెంట్స్..!

Divya
బాలీవుడ్లో ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలై భారీ విజయాన్ని అందుకున్న చిత్రాలలో దురంధర్ సినిమా కూడా ఒకటి. హీరోగా రన్వీర్ సింగ్, డైరెక్టర్ ఆదిత్యధర్ ఈ చిత్రాన్ని ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు. సుమారుగా రూ .1300 కోట్ల రూపాయలకు పైగా ఈ సినిమా కలెక్షన్స్ రాబట్టి అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ సినిమా సీక్వెల్ పైన కూడా అభిమానులు చాలా ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. మార్చి 19వ తేదీన విడుదల కాబోతోంది. ఇప్పటికే సినిమా నుంచి విడుదలైన టీజర్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. తాజాగా దురంధర్ సినిమా కలెక్షన్స్ పైన హీరో అమిర్ ఖాన్ స్పందిస్తూ పలు కీలకమైన వ్యాఖ్యలు చేశారు.


అమీర్ ఖాన్ మాట్లాడుతూ ఈ సినిమాకి దక్కిన స్క్రీన్లకంటే మరికొన్ని థియేటర్లలో కూడా అందుబాటులో ఉండి ఉంటే ఎవరు ఊహించని కలెక్షన్స్ వచ్చేవని తన అభిప్రాయంగా తెలిపారు. చైనాలో సుమారుగా  లక్ష స్క్రీన్ ల వరకు అందుబాటులో ఉన్నాయి, కానీ మన దేశంలో మాత్రం 9000 లోపే ఉన్నాయంటూ గుర్తు చేశారు. గత ఏడాది చైనాలో విడుదలైన నె ఝా 2 అనే చిత్రానికి ఏకంగా 2 బిలియన్ డాలర్ల కలెక్షన్స్ సాధించింది. చైనాలో ఉండే సదుపాయాల కారణంగా వేల కోట్ల రూపాయలు సినిమా కలెక్షన్స్ రాబడుతున్నాయని తెలిపారు.


కేవలం దురంధర్ సినిమా 5000 స్క్రీన్ లలో విడుదలై రూ.1300 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. ఒకవేళ మనకి కూడా 15,000 వేల స్క్రీన్లు అందుబాటులో ఉంటే ఈ సినిమా కలెక్షన్స్ ఎలా ఉండేవో ఒకసారి ఊహించుకోండి అంటూ తెలిపారు. మన దేశంలో చాలా ప్రాంతాలలో కూడా ఒక్క సినిమా హాలు లేని ప్రాంతాలు ఉన్నాయని ఇండియాలో కేవలం 2 శాతం మంది మాత్రమే పెద్ద చిత్రాలను థియేటర్లో చూస్తున్నారు. ఎక్కువమంది ఓటిటిలోనే సినిమాలను చూసేస్తున్నారంటూ తెలిపారు. థియేటర్ల సంఖ్య పెరిగితేనే సినిమా ఇండస్ట్రీ అభివృద్ధి చెందుతుందని అమీర్ ఖాన్ మాట్లాడారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: