కోహ్లీ భాయ్.. నిజంగా ఇది అస్సలు ఊహించలేదు?

praveen
ప్రస్తుతం టీమిండియాలో కీలక బ్యాట్స్మెన్ గా మాత్రమే కాదు అటు ప్రపంచ క్రికెట్లో అత్యుత్తమ ఆటగాడిగా కొనసాగుతూ ఉన్నాడు విరాట్ కోహ్లీ. అయితే ఆసియా కప్ ముందు వరకు కూడా టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఎంతలా విమర్శలు ఎదుర్కొన్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఏకంగా టీమ్ ఇండియాలో విరాట్ కోహ్లీకి ప్లేస్ ఉంటుందా లేదా అన్న విషయంపై తీవ్రస్థాయిలో చర్చ జరిగింది అని చెప్పాలి. ఇక ఇలా తీవ్రమైన విమర్శలు ఎదుర్కొంటున్న సమయంలో ఆసియా కప్ లో చివర్లో జరిగిన ఆఫ్ఘనిస్తాన్ తో జరిగిన మ్యాచ్లో సెంచరీ చేసి ఇక మూడేళ్లుగా దక్కని 71 వ సెంచరీని అందుకున్నాడు.

 ఇక ఆ తర్వాత తాను ఫామ్ లోకి వచ్చాను అన్న విషయాన్ని తన ఆట తీరుతోనే నిరూపించాడు. ఇక ఆస్ట్రేలియా వేదికగా జరిగిన టి20 వరల్డ్ కప్ లో నాలుగు హాఫ్ సెంచరీలతో ఏకంగా 296 పరుగులు చేసి టోర్నీలోనే అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్మెన్ గా రికార్డు సృష్టించాడు.  అయితే ఇప్పుడు మాత్రం మరోసారి ఉసురుమనిపిస్తున్నాడు విరాట్ కోహ్లీ. తాను ఫామ్ లోకి వచ్చింది కేవలం టి20 ఫార్మాట్లో మాత్రమే అని వన్డేల్లో కాదు అని నిరూపించుకుంటున్నాడు. బంగ్లాదేశ్ తో జరిగిన తొలి వన్డే మ్యాచ్లో వన్ డౌన్ లో బ్యాటింగ్ కి వచ్చిన కోహ్లీ 15 బంతుల్లో తొమ్మిది పరుగులు మాత్రమే చేసి వికెట్ కోల్పోయాడు  ఇక రెండో బండిలో 6 బంతులలో ఐదు పరుగులు మాత్రమే చేశాడు.

 అయితే రెండో వన్డే మ్యాచ్ లో రోహిత్ కి గాయం కావడంతో విరాట్ కోహ్లీ ఓపెనర్ గా బరిలోకి వచ్చాడు అన్న విషయం తెలిసిందే. అయితే రోహిత్ శర్మ అందుబాటులో లేని సమయంలో అతని స్థానంలో టీమిండియా తరఫున ఓపెనింగ్ చేసిన విరాట్ కోహ్లీ గత 7 వన్ డే లలో కూడా 20 ప్లస్ స్కోర్ చేయలేకపోయాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు   అంతేకాదు ఇక సింగిల్ డిజిట్ స్కోర్ చేయడానికి కూడా విరాట్ కోహ్లీ ఎంతగానో ఇబ్బంది పడిపోతున్నాడు అని చెప్పాలి. దీంతో మరోసారి విరాట్ కోహ్లీ ఫామ్ పై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి అని చెప్పాలి. ఫామ్ లోకి రాగానే సంతోషపడ్డాం కానీ వన్డేల్లో ఇలా ఆడుతావని అస్సలు ఊహించలేదు అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: