వారెవ్వా రషీద్ ఖాన్.. ఓడినా వణికించాడు?
అయితే ఆస్ట్రేలియా విజయం సాధించినప్పటికీ కూడా అటు మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఆస్ట్రేలియాకు ఓటమి భయం ఎలా ఉంటుందో చూపించాడు రషీద్ ఖాన్.. చివర్లో బంగ్లాదేశ్ కి తక్కువ బంతుల్లో ఎక్కువ పరుగుల అవసరమైన సమయంలో రషీద్ ఖాన్ ఎవరు ఊహించని రీతిలో సిక్సర్లు ఫోర్లతో చెలరేగిపోయాడు. దీంతో ఒకసారిగా ఆస్ట్రేలియా వైపు ఉన్న మ్యాచ్ మొత్తం బంగ్లాదేశ్ వైపు టర్న్ అయింది అని చెప్పాలి. కానీ రషీద్ ఖాన్ చివరి వరకు ఎంతో అద్భుతంగా పోరాడినప్పటికీ ఇక స్వల్ప తేడాతో ఆస్ట్రేలియా విజయం సాధించింది. 18 బంతుల్లో 49 పరుగులు చేయాల్సిన సమయంలో రషీద్ ఖాన్ విజృంభించాడు.
ఏకంగా 23 బంతుల్లోనే 48 పరుగులు సాధించాడు. ఇందులో మూడు ఫోర్లు నాలుగు సిక్సర్లు ఉండటం గమనార్హం. ఇలా దాదాపు ఆఫ్గనిస్తాన్ జట్టు విజయానికి చేరువగా వచ్చింది అని చెప్పాలి. చివరి ఆరు బంతులో 22 పరుగులు కావాల్సి ఉండగా చివరి ఓవర్లో ఒక ఫోర్ ఒక సిక్స్ తో మ్యాచ్ మరింత ఉత్కంఠ బరితంగా మార్చాడు రషీద్ ఖాన్. రెండు బంతుల్లో 11 పరుగులు చేయాల్సిన దశలో ఆస్ట్రేలియా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో చివరికి నాలుగు పరుగుల దూరంలో ఆఫ్ఘనిస్తాన్ ఆగిపోయింది. అయినప్పటికీ రషీద్ ఖాన్ ప్రేక్షకుల మనసులు గెలుచుకున్నాడు.