ట్విస్ట్ అంటే ఇది.. జింబాబ్వే ఓడింది.. కానీ చివరి బంతి నోబాల్?
ఎంతో ఉత్కంఠ భరితంగా జరిగిన మ్యాచ్లో జింబాబ్వే పై బంగ్లాదేశ్ జట్టు మూడు పరుగుల తేడాతో విజయం సాధించింది అన్న విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో జింబాబ్వే ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్ లో హైడ్రామా చోటు చేసుకుంది అని చెప్పాలి. చివరి ఓవర్లో జింబాంబే విజయానికి 16 పరుగులు కావాల్సి ఉండగా.. తొలి బంతికే లెగ్ బైస్ రూపంలో ఒక పరుగు వచ్చింది. కానీ రెండో బంతికే వికెట్ పడింది. దీంతో సమీకరణం నాలుగు బంతుల్లో 15 పరుగులుగా మారింది. ఇక మూడో బంతికి లెగ్ బైస్ రూపంలో నాలుగు పరుగులు, నాలుగో బంతికి నగరావ భారీ సిక్సర్ బాదాడు. దీంతో ఒక్కసారిగా మ్యాచ్ జింబాబ్వే వైపు మళ్ళింది.
ఆఖరి 2 బంతులకు జింబాబ్వే విజయానికి 5 పరుగుల అవసరమయ్యయ్. ఈ క్రమంలోనే ఐదో బంతి కి నగరావ భారీ షాట్ కు ప్రయత్నించి స్టంప్ అవుట్ గా వెనుతిరిగాడు. ఇక ఆ తర్వాత ఆఖరి బంతికి కూడా ముషరాబాని స్టంప్ అవుట్ అయ్యాడు. దీంతో బంగ్లాదేశ్ గెలుపు సంబరాల్లో మునిగిపోయింది. ఓటమి బాధతో జింబాబ్వే ఆటగాళ్లు డగౌట్ చేరుకున్నారు. ఇంతలో ఎంపైర్లు ట్విస్ట్ ఇచ్చారు.ఆఖరి బంతిని నోబాల్ గా ప్రకటించాడు అంపైర్.. స్టంప్ అవుట్ చేసే క్రమంలో బంగ్లాదేశ్ వికెట్ కీపర్ నూరల్ అత్యుత్సాహం లో వికెట్లను దాటి వచ్చి ముందే బంతిని అందుకొని రూల్స్ అతిక్రమించాడు. ఐసిసి నిబంధన ప్రకారం కీపర్ ఇలా చేయకూడదు. బంతి బ్యాట్స్మెన్, లేదా బ్యాట్ ను తాకిన తర్వాత లేదా వికెట్లను దాటిన తర్వాత బంతిని అందుకోవాలి.. అంతకు ముందుగానే కీపర్ బంతిని అందుకుంటే నోబాల్ గా ప్రకటిస్తారు. ఇక ఇలా చివరి బంతి నోబాల్ ప్రకటించగా.. ఆఖరి బంతికి ఐదు పరుగులు కావలసిన సమయంలో చక్కటి బంతి వేసిన బంగ్లాదేశ్ బౌలర్ చివరికి జట్టుకు విజయాన్ని అందించాడు.