కోహ్లీ నుంచి ఈ ఐదు విషయాలు.. అందరూ నేర్చుకోవాల్సిందే?

praveen
ప్రస్తుతం క్రికెట్ ప్రపంచం మొత్తం విరాట్ కోహ్లీ గురించి చర్చించుకుంటుంది. ఇటీవలే వరల్డ్ కప్ లో భాగంగా విరాట్ కోహ్లీ పాకిస్తాన్ పై ఆడిన అద్భుతమైన ఇన్నింగ్స్ గురించి తలుచుకుంటూ ఎంతో మంది ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే భారత్ పాకిస్తాన్ మ్యాచ్ తర్వాత ఇంకా వరల్డ్ కప్ లో మ్యాచ్ లు జరుగుతున్నప్పటికీ నరాలు తెగే ఉక్కంటి మధ్య జరిగిన మ్యాచ్ ని.. విరాట్ కోహ్లీ అద్భుతమైన ఇన్నింగ్స్ ని మాత్రం మరవలేక పోతున్నారు క్రికెట్ ప్రేక్షకులు. ఈ క్రమంలోనే ఎంతోమంది ఇక విరాట్ కోహ్లీ వీరోచితమైన ఇన్నింగ్స్ గురించి చర్చించుకుంటున్నారు అని చెప్పాలి.

 అయితే విరాట్ కోహ్లీ గురించి ఇంతలా చర్చ జరగడానికి వెనుక ఒక కారణం కూడా ఉంది. ఎందుకంటే మొన్నటి వరకు విరాట్ కోహ్లీ ఎంత గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అప్పటికే అంతర్జాతీయ క్రికెట్లో అత్యుత్తమ ఆటగాడిగా తనని తాను నిరూపించుకున్నాడు. ఎన్నో రికార్డులు కూడా క్రియేట్ చేశాడు. కానీ గత కొన్ని రోజుల నుంచి మాత్రం విరాట్ కోహ్లీ పేలవమైన ఫామ్ తో ఇబ్బందులు పడ్డాడు. దీంతో విరాట్ కోహ్లీని పొగిడిన వారే ఆ తర్వాత విమర్శించడం కూడా మొదలుపెట్టారు.  ఇక ఇలాంటి కష్ట పరిస్థితులను దాటుకొని మళ్ళీ విరాట్ కోహ్లీ ప్రపంచం చేత సలాం కొట్టించుకునే స్థాయికి ఎదిగాడు.

 దీన్ని బట్టి ఇక విరాట్ కోహ్లీ నుంచి 5 విషయాలను ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి అని నిపుణులు చెబుతున్నారు  ఎవరి జీవితంలోనైనా సరే చెడు కాలం తక్కువ సమయం మాత్రమే ఉంటుంది. ఇక ఎవరికైనా సమాధానాలు చెప్పాలి అనుకుంటే మీ పని తీరు ద్వారా మాత్రమే ప్రతిస్పందించాలి. ఇక చివరి నిమిషం వరకు మీ భావోద్వేగాలను అదుపులో ఉంచుకోండి. ఆత్మవిశ్వాసం పెరిగినప్పుడు క్లిష్ట పరిస్థితులు కూడా మన ముందు తలవంచుతాయి అన్న విషయాన్ని విరాట్ కోహ్లీని చూసి ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి అని నిపుణులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: