ఒత్తిడి ఎలా అధిగమించాలో.. కోహ్లీ దగ్గర నేర్చుకుంటా?
వరల్డ్ కప్ పరిస్థితులను అధిగమించడంలో విరాట్ కోహ్లీకి ఉన్న అపారమైన అనుభవం పనికొస్తుంది అంటూ వికెట్ కీపర్ చెప్పుకొచ్చాడు. ఇక పాకిస్తాన్తో జరిగే మ్యాచ్ లో కోహ్లీతో బ్యాటింగ్ పునరుద్ధరించాలని భావిస్తున్నాను అంటూ తెలిపాడు. ఒత్తిడి పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలో కోహ్లీ నేర్పగలడు. భవిష్యత్తు ప్రయాణంలో అదంతా ఉపయోగపడుతుంది. అతని బ్యాటింగ్ చేయడం ఎల్లప్పుడూ బాగుంటుంది. బాత్రూంలో ఎంతో అనుభవం ఉన్న ఆటగాడు మనతో ఉంటే ఎల్లప్పుడు బాగుంటుంది. మ్యాచ్ ఎలా ఆడాలి.. బంతికొక పరుగు చేయాల్సినప్పుడు ఒత్తిడిని ఎలా అధిగమించాలి అతనికి బాగా తెలుసు.
అందుకే ఈ ఏడాది వరల్డ్ కప్ లో విరాట్ కోహ్లీ దగ్గర ఒత్తిడిని ఎలా అధిగమించాలి అనే విషయాన్ని నేర్చుకుంటాను అంటూ చెప్పుకొచ్చాడు రిషబ్ పంత్. ఇక గత ఏడాది జరిగిన టి20 ప్రపంచ కప్ లో పాకిస్తాన్ చేతిలో టీమిండియా ఓడిన మ్యాచ్లో విరాట్ కోహ్లీతో కలిసి రిషబ్ పంత్ 53 పరుగులు జోడించారు. ఇద్దరూ దాటిగా ఆడి మంచి భాగస్వామ్యాన్ని నెలకొల్పారు అని చెప్పాలి. పాకిస్తాన్ తో మ్యాచ్ అంటే ఎప్పుడు ప్రత్యేకమైన అని రిషబ్ పంత్ చెప్పుకొచ్చాడు. మ్యాచ్ చుట్టూ ఎంతో హడావిడి ఉంటుంది. మాతోపాటు అభిమానులు ప్రతి ఒక్కరికి అది భావోద్వేగాపూరితమైనది అంటూ పంత్ అన్నాడు.