ఫ్రిడ్జ్ గ్లాస్ పగలగొట్టిన సూర్యకుమార్.. అసలేం జరిగిందంటే?

praveen
ఇటీవలే ఆసియా కప్ లో భాగంగా టీమిండియా ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరిగిన నామమాత్రమైన మ్యాచ్లో టీమిండియా ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఆసియా కప్ లో అప్పటివరకు ఆడిన అన్ని మ్యాచ్ లలో కెల్లా అద్భుతమైన ప్రదర్శన నామాత్రమైన మ్యాచ్లో టీమిండియా చేసిందనే చెప్పాలి. ఏకంగా 101 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది టీమిండియా.  ఇక ఎన్నో రోజుల తర్వాత విరాట్ కోహ్లీ సెంచరీ చేయడం మ్యాచ్ మొత్తానికే హైలైట్ గా మారిపోయింది.. ఒక వెయ్యి 21 రోజుల తర్వాత విరాట్ కోహ్లీ మూడంకెల స్కోరు అందుకున్నాడు  అని చెప్పాలి.

 కాగా మూడో నెంబర్ బ్యాట్స్మెన్గా జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన సూర్యకుమార్ యాదవ్ మంచి పరుగులు చేస్తాడు అనుకుంటే తక్కువ పరుగులకే వికెట్ చేజార్చుకున్నాడు అని చెప్పాలి. అయితే మొదటి బంతిని భారీ సిక్సర్ గా మలిచాడు సూర్యకుమార్ యాదవ్. ఇక అదే ఊపులో రెండో బంతిని కూడా కొట్టబోయి చివరికి క్లీన్ బౌల్డ్ అయ్యాడు అనే చెప్పాలి. అయితే సూర్య కుమార్ యాదవ్ ఒక సిక్సర్ కొట్టినప్పటికి కూడా ఆ సిక్సర్  కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది.

 ఫరీద్ అహ్మద్ వేసిన 13 ఓవర్లో బంతిని నేరుగా ఫైన్ లెగ్ దిశగా నేరుగా స్టాండ్ లో కి తరలించాడు సూర్యకుమార్ యాదవ్. అయితే ఆ బంతి డైరెక్ట్ గా వెళ్లి ఆఫ్ఘనిస్తాన్ డగౌట్ లోని ఫ్రిడ్జ్ గ్లాస్ ను పగలగొట్టింది.  వీడియో కాస్త వైరల్ గా మారిపోయింది. సూర్యకుమార్ షాట్ కొడితే ఇలాగే ఉంటుంది మరి అని అభిమానులు ఎంతో మంది కామెంట్లు చేస్తూ ఉండటం గమనార్హం.  మొదటి బంతిని సిక్సర్ కొట్టి ఊపు మీద కనిపించిన సూర్యకుమార్ యాదవ్ అనూహ్యంగా రెండో బంతికే వికెట్ కోల్పోవడంతో అందరూ షాక్ అయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: