బాబర్ అజంకు షాక్.. వరల్డ్ నెంబర్ 1 ర్యాంక్ గల్లంతు?

praveen
పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజం గత కొంతకాలం నుంచి అద్భుతమైన ఫామ్లో కొనసాగుతూ అదిరిపోయే  ప్రదర్శన తో ఆకట్టుకుంటున్నాడు అన్న విషయం తెలిసిందే. పాకిస్తాన్ జట్టు కష్టాల్లో ఉన్న ప్రతి సారి తన బ్యాటింగ్తో మెరుపులు మెరిపిస్తూ జట్టుకు విజయాన్ని అందిస్తున్నాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఈ క్రమంలోనే పరిమిత ఓవర్ల ఫార్మాట్లో వరల్డ్ నెంబర్ వన్ గా కొనసాగుతున్నాడు అని చెప్పాలి. వరల్డ్ నెంబర్వన్ బ్యాట్స్మెన్గా అరుదైన రికార్డును కూడా సృష్టించాడు.  విరాట్ కోహ్లీ కంటే ఎక్కువ కాలం పాటు నెంబర్ వన్ పొజిషన్లో కొనసాగిన ఏకైక బ్యాట్స్మెన్ గా బాబర్ అజం రికార్డు సృష్టించాడు అనే విషయం తెలిసిందే.

 అయితే మొన్నటి వరకు మంచి ప్రదర్శన చేస్తూ ఆకట్టుకున్న బాబర్ అజం ఆసియా కప్  లో మాత్రం పెద్దగా రాణించలేకపోయాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే అతను ఫామ్ కోల్పోయినట్లుగా కనిపించాడు.  ఆసియా కప్ లో తక్కువ పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయి తీవ్రంగా నిరాశ పరిచాడు బాబర్ అజాం. ఈ క్రమంలోనే ఇటీవల ఐసీసీ విడుదల చేసిన టీ20 ర్యాంకింగ్స్ లో ఒక స్థానం కోల్పోయాడు. 794 పాయింట్లతో కేవలం రెండవ స్థానానికి పరిమితం అయ్యాడు బాబర్ అజం. మొన్నటి వరకూ ఐసిసి ర్యాంకింగ్స్ లో దూసుకుపోయిన సూర్యకుమార్ యాదవ్ ఒక్కసారిగా కిందకు పడిపోయాడు అని చెప్పాలి.

 హాంకాంగ్ మినహా పాకిస్థాన్తో శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లలో పెద్దగా రాణించలేక పోయినా సూర్యకుమార్ యాదవ్ రెండు స్థానాలు కిందపడిపోయాడు.  రెండో ర్యాంకు నుంచి నాలుగో ర్యాంకు పడిపోయాడు అని చెప్పాలి. 775 రేటింగ్ పాయింట్లతో ప్రస్తుతం నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు. అయితే శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో 41 బంతుల్లోనే 72 పరుగులు చేసిన భారత కెప్టెన్ రోహిత్ శర్మ మూడు స్థానాలు మెరుగుపరుచుకుని 14వ స్థానంలో కొనసాగుతున్నాడు. విరాట్ కోహ్లీ సైతం నాలుగు స్థానాలు ఎగబాకి 23వ స్థానంలో ఉండడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: