తన పేలవమైన ఫామ్ పై.. కోహ్లీ కీలక వ్యాఖ్యలు?
కానీ భారీ అంచనాల మధ్య బరిలోకి దిగుతున్న విరాట్ కోహ్లీ మాత్రం వరుస వైఫల్యాలు కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉండడంతో ప్రస్తుతం ఎంతో మంది మాజీ క్రికెటర్లు కూడా ఇదే విషయంపై స్పందిస్తూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే కొంతమంది విరాట్ కోహ్లీ కి మద్దతుగా నిలుస్తూ ఉంటే మరి కొంత మంది మాత్రం అతనిపై విమర్శలు చేస్తూ ఉండటం గమనార్హం. అయితే ఇక తాను తనపై వచ్చే విమర్శలను పట్టించుకోను అంటూ గత కొంత కాలం నుంచి విరాట్ కోహ్లీ చెబుతూనే వస్తున్నాడు. ఇటీవలే తన పేలవమైన ఫామ్ గురించి మరోసారి స్పందించారు విరాట్ కోహ్లీ.
తన ఫామ్ గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు అని చెప్పాలి. ప్రస్తుత నా ఆట తీరు ఎలా ఉందో నాకు ఒక అంచనా ఉంది. పరిస్థితులు వాతావరణం రకరకాల బౌలర్లను ఎదుర్కొనే సత్తా లేకుండా ఇన్నేళ్లు నా కెరీర్ సాగుతుందని నేను అనుకోను. ఇదంతా ప్రాసెస్ చేసుకోడానికి నా కెరీర్లో ఇదొక ఫేస్.. ఇక ఈ దశ నుంచి తేరుకోవడానికి ప్రయత్నిస్తున్న.. ఈ ఫేస్ నుంచి తేరుకుని మళ్ళీ మునుపటి ఫామ్ లోకి వస్తే.. ఎంత నిలకడగా రాణించగలనో నాకు తెలుసు అంటూ విరాట్ కోహ్లీ కీలక వ్యాఖ్యలు చేశాడు.