శుభ మన్ గిల్ అరుదైన రికార్డు.. మూడో భారత బ్యాట్స్మెన్ గా?

praveen
టీమిండియా యువ ఓపెనర్ శుభ మన్ గిల్ గత కొంత కాలం నుంచి అత్యుత్తమమైన ఫామ్ లో కొనసాగుతూ ఉన్నాడు అన్న విషయం తెలిసిందే.  ఈ క్రమంలోనే ప్రతి మ్యాచ్ లో కూడా భారీగా పరుగులు చేస్తూ టీమిండియా విజయంలో కీలకపాత్ర వహిస్తూ ఉన్నాడు ఈ యువ ఆటగాడు. టి20 వరల్డ్ కప్ జట్టులో స్థానం దక్కించుకోవడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాడు అని చెప్పాలి. ఇకపోతే ఇటీవలే జింబాబ్వే పర్యటనలో కూడా తన అద్భుతమైన ఫామ్ కొనసాగిస్తూ ఉన్నాడు. మొదటి మ్యాచ్లో భాగంగా దాదాపు 82 పరుగులు చేసి జట్టుకు విజయాన్ని అందించాడు.

 ఇక ఇటీవల జింబాబ్వే జట్టుతో హరారే వేదికగా జరిగిన రెండో మ్యాచ్లో కూడా శుభ మన్ గిల్ అదే రీతిలో రాణించాడు అని చెప్పాలి. ఏకంగా 33 పరుగులు చేశాడు. ఈ క్రమంలోనే ఒక అరుదైన ఘనత సాధించాడు ఈ యువ ఆటగాడు. వన్డే ఫార్మాట్లో 8 ఇన్నింగ్స్ ల తర్వాత అత్యధిక పరుగులు చేసిన మూడో భారతీయ ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఇటీవల హారారే వేదికగా జరిగిన రెండో వన్డే మ్యాచ్లో భాగంగా 33 పరుగులు చేశాడు. ఈ క్రమంలోనే ఎక్కువ పరుగులు చేసిన బ్యాట్స్మెన్ గా ఒక అరుదైన రికార్డు అతని ఖాతాలో చేరిపోయాయి. అయితే ఈ రికార్డు సాధించిన లిస్టులో శ్రేయస్ అయ్యర్ మొదటి స్థానంలో ఉన్నాడు అని చెప్పాలి.

 శ్రేయస్ అయ్యర్ ఏకంగా 416 పరుగులతో టాప్ ప్లేస్లో కొనసాగుతుండగా.. నవజ్యోత్ సింగ్ సిద్ధూ 414 పరుగులతో పరుగులతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. కాగా ఇప్పటివరకు 8 వన్డేలు ఆడిన శుభ మన్ గిల్ 369 పరుగులతో మూడవ స్థానం లోకి వచ్చాడు. కాగా ప్రస్తుతం అతను అద్భుతమైన ఫామ్లో కొనసాగుతూ ఉన్నాడు అని చెప్పాలి.  మొన్నటికి మొన్న వెస్టిండీస్ పర్యటనలో తన బ్యాటింగ్తో దుమ్మురేపిన శుభ మన్ గిల్.. ఇక ఇప్పుడు జింబాబ్వే పర్యటనలో అదే జోరు కొనసాగిస్తున్నాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే భారత జట్టు ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ క్రమంలోనే ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ను కైవసం చేసుకుంది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Gil

సంబంధిత వార్తలు: