19 ఏళ్ల తర్వాత.. ఇంగ్లాండ్ జట్టుకు ఘోరపరాభవం?
దిగ్గజ ఇంగ్లాండ్ జట్టు కి ఏకంగా సొంతగడ్డపైనే షాక్ కి ఇవ్వడం లాంటివి చేస్తూ ఉంటాయి. వెరసి ఇది కాస్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుంది. అయితే మొన్నటికి మొన్న అటు భారత జట్టు ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లిన సమయంలో అక్కడ మొదటి టెస్టు మ్యాచ్ ఓడిపోయి విమర్శలు ఎదుర్కొంది. కానీ ఆ తర్వాత మాత్రం వన్డే టి20 సిరీస్లో విజయం సాధించి సత్తా చాటింది అనే విషయం తెలుస్తుంది. ఇక దక్షిణాఫ్రికా ఇంగ్లాండ్ జట్టు తో టెస్టు సిరీస్ ఆడుతుంది. ఈ క్రమంలోనే ఊహించని రీతిలో ఇంగ్లాండ్ జట్టుకు షాక్ ఇచ్చింది.. దీంతో దాదాపు 19 ఏళ్ల తర్వాత ఇంగ్లాండ్ ఘోర పరాభవాన్ని చవిచూసింది.
దీంతో క్రికెట్ ప్రేక్షకులు అందరూ కూడా అవాక్కవుతున్నారు అని చెప్పాలి. లార్డ్స్ మైదానంలో ఇంగ్లండ్తో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా ఒక ఇన్నింగ్స్ తో పాటు 12 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ లో 165 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఇక సౌత్ఆఫ్రికా 326 పరుగులు చేసింది. ఇక ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ పుంజుకుంటుందని అందరూ అనుకున్నారు. కానీ 149 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఈ క్రమంలోనే లార్డ్స్ లో ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ తో తేడాతో ఓడిపోవడం 19 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి అని చెప్పాలి. 2003లో కూడా ఇదే దక్షిణాఫ్రికాపై ఒక ఇన్నింగ్స్ తో పాటు 92 పరుగులు తేడాతో ఓడిపోయింది ఇంగ్లాండ్ జట్టు.