ఇండియాపై గెలుపు కాదు.. బాబర్ టార్గెట్ అదేనట?
ఇక ఇప్పుడు భారత్ పై గెలుపు మాత్రమే కాదు ఆసియా కప్ అందుకోవడమే బాబర్ అజాం లక్ష్యం అని తెలుస్తూ ఉంది. ఎందుకంటే బాబర్ అజాం పాకిస్థాన్ జట్టు కెప్టెన్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత.. పాకిస్తాన్ ద్వైపాక్షిక సిరీస్ లలో మంచి విజయాలు సాధించింది. కానీ పాకిస్తాన్ కు ఒక్క మేజర్ టోర్నీలో కూడా అద్భుతమైన విజయాన్ని అందించలేకపోయాడు. ఇక మరికొన్ని రోజులలో జరగబోయే ఆసియా కప్లో కూడా పాకిస్థాన్కు కొన్నేళ్ల నుంచి నిరాశే ఎదురవుతుంది. చివరిసారిగా 2012లో మిస్బావుల్ హక్ నేతృత్వంలో బంగ్లాదేశ్ ను ఫైనల్లో మట్టికరిపించిన పాకిస్తాన్ ఆసియా కప్ అందుకుంది. అప్పుడు నుంచి ఇప్పటివరకు మరోసారి కప్ సాధించలేకపోయింది.
ఈ క్రమంలోనే ఈ సారి ఎట్టి పరిస్థితుల్లో తన కెప్టెన్సీలో ఆసియా కప్ లో తన జట్టును విజేతగా నిలపాలని బాబర్ అజాం పట్టుదలతో ఉన్నాడు అంటూ క్రికెట్ విశ్లేషకులు అనుకుంటున్నారు.. అయితే ఆసియా కప్ గెలిచిన తర్వాత ఇక ఆ టి20 వరల్డ్ కప్ పై కూడా కన్నెయ్యపోతున్నాడట బాబర్ అజాం. అయితే గత ఏడాది జరిగిన టి20 వరల్డ్ కప్ లో లీగ్ దశలో ఓటమి లేకుండా దూసుకుపోయిన పాకిస్తాన్ సెమీస్లో మాత్రం ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయి ఇంటి బాట పట్టింది. ఇలా తన కెప్టెన్సీలో పాకిస్థాన్ జట్టును ఒక మేజర్ టోర్నీలో అయినా గెలిపించాలని అనుకుంటున్నాడట బాబర్ అజాం. ఏం జరుగుతుందో చూడాలి మరి.