సచిన్ స్నేహితుడు.. క్రికెట్ లో స్టార్.. కానీ ఇప్పుడు పూట గడవని పరిస్థితి?
కానీ ఇప్పుడు మాత్రం దీనస్థితిని ఎదుర్కొంటున్నాడు అని చెప్పాలి. ఆ క్రికెటర్ ఎవరో కాదు 90వ దశకంలో క్రికెట్ అభిమానులను అలరించి ఎంతగానో గుర్తింపు సంపాదించుకున్న వినోద్ కాంబ్లీ. అయితే క్రికెట్లో రాణించాలంటే కేవలం టాలెంట్ మాత్రమే కాదు క్రమశిక్షణ కూడా ఉండాలి. కానీ ఆ విషయంలో వినోద్ కాంబ్లీ తప్పటడుగులు వేశాడు. అప్పుడు భారీ పరుగులతో సచిన్ను మించిపోయేలా కనిపించిన అతను క్రమశిక్షణ లేమితో తాగుడుకు బానిస గా మారి పోయి ఫామ్ కోల్పోయాడు. వెరసి జట్టుకు దూరమయ్యాడు అనే చెప్పాలి. తర్వాత ఎన్నో సార్లు అవకాశాలు దక్కించుకున్నప్పటికి కూడా తన మునుపటి ఫామ్ మాత్రం అందుకోలేకపోయాడు.
ఆ తర్వాత కూడా వృత్తి,వ్యక్తిగత జీవితంలో కూడా నిత్యం ఏదో ఒక వివాదంతో వినోద్ కాంబ్లీ వార్తల్లో నిలిచాడు అని చెప్పాలి. కానీ ఇప్పుడు దీన స్థితిలో బ్రతుకుతున్నాడు అనేది తెలుస్తుంది. ఆర్థిక ఇబ్బందులలో కూరుకుపోయి పూటగడవని పరిస్థితిలో వినోద్ ఉన్నాడట. ఈ క్రమంలోనే క్రికెట్ కు సంబంధించి ఏదైనా పని ఇవ్వాలని బీసీసీఐ ని దీనంగా వేడుకుంటున్నాడు అని తెలుస్తోంది. బీసీసీఐ ఇస్తున్న 30 వేల పెన్షన్ తనకు సరిపోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. అందుకే తనకు ఎదయినా పని ఇప్పించమని అంటూ అభ్యర్థించడం గమనార్హం. అయితే తన చిన్ననాటి స్నేహితుడు సచిన్ ఇప్పటికే ఎన్నో సార్లు తన వంతు సహాయం చేశాడు అంటూ చెప్పుకొచ్చాడు.