పసికూన అనుకున్నారు.. భారత్ కు చెమటలు పట్టించింది?

praveen
హార్దిక్ పాండ్యా టీమిండియా కెప్టెన్ గా అవతరించగా.. యువ ఆటగాళ్లతో కూడిన భారత జట్టు ఐర్లాండ్ పర్యటనకు  బయలుదేరింది. ఇక ఐర్లాండ్ పర్యటనలో భాగంగా రెండు టి20 మ్యాచ్ ల సిరీస్ ఆడింది భారత జట్టు. ఈ క్రమంలోనే హార్దిక్ పాండ్యా తన కెప్టెన్సీ వ్యూహాలతో మొదటి టీ20 మ్యాచ్లో విజయం సాధించాడు. ఇక రెండవ టీ20 మ్యాచ్ లో ఎవరు విజయం సాధిస్తారు అన్నది ఆసక్తికరంగా మారిపోయింది. ఇటీవల జరిగిన రెండో టి20 మ్యాచ్ ఎంతో ఉత్కంఠ భరితంగా జరిగింది అని చెప్పాలి. ఈ మ్యాచ్లో భాగంగా మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు అద్భుతమైన ప్రదర్శన చేసింది.

 ఓపెనర్లు దీపక్ కూడా సెంచరీతో చెలరేగాడు. 57 బంతుల్లో 104 పరుగులు చేశాడు. ఇక జట్టులో స్థానం సంపాదించుకున్న సంజూ శాంసన్ సైతం 77 పరుగులు సాధించి అదరగొట్టాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే టీమిండియా భారీ స్కోరు చేయగలిగింది. ఏకంగా నిర్ణీత 20 ఓవర్లలో 7వికెట్ల నష్టానికి 225 పరుగులు చేయగా.. ఐర్లాండ్ జట్టు గెలవాలంటే 226 పరుగులు చేసి భారీ టార్గెట్ ఛేధించాల్సిన  పరిస్థితి ఏర్పడింది. అయితే ఇంత భారీ లక్ష్యాన్ని అటు పసికూన ఐర్లాండ్ చేదించడం  కష్టం అని అందరూ అనుకున్నారు. తక్కువ పరుగులకే ఐర్లాండ్  ఆలౌట్ అవుతుందని భావించారు.

 కానీ పసికూన ఐర్లాండ్ మాత్రం దిగ్గజ టీమిండియాకు ముచ్చెమటలు పట్టించింది అని చెప్పాలి. ఒకానొక సమయంలో ఇక ఐర్లాండ్ విజయం ఖాయం అనే పరిస్థితులు తీసుకువచ్చింది. ఐర్లాండ్ బ్యాట్స్మెన్లు అందరూ కూడా భారత బౌలర్లతో చెడుగుడు ఆడేశారు. సిక్సర్లు ఫోర్లతో వీరవిహారం చేస్తూ స్కోరుబోర్డును పరుగులు పెట్టించారు. క్రీజులోకి వచ్చిన ప్రతి బ్యాట్స్మెన్ కూడా బౌండరీలు బాదటమే లక్ష్యంగా పెట్టుకున్నారు అని చెప్పాలి. చివరి ఓవర్ వరకు ఎంతో ఉత్కంఠగా జరిగింది మ్యాచ్. ఆఖరి ఓవర్లో 16 పరుగులు  అవసరం కాగా ఉత్కంఠ పోరులో 12 రన్స్ చేసింది ఐర్లాండ్ జట్టు. దీంతో నాలుగు పరుగుల తేడాతో చివరి ఓడిపోయింది. అయినప్పటికీ ఊహించని విధంగా భారత్ కు గట్టి పోటీ ఇచ్చింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: