రంజీలో రాణించారు.. చివరికి ప్రపంచ రికార్డు?

praveen
ప్రస్తుతం రంజీ మ్యాచ్ లు ఎంతో ఉత్కంఠ భరితంగా జరుగుతూ ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక ఈ రంజీ మ్యాచ్లో చెలరేగి ఆడుతున్న ఎంతో మంది క్రికెటర్లు అరుదైన రికార్డులు సాధిస్తున్నారు.  కొంత మంది క్రికెటర్లు వైపు ఏకంగా టి20 తరహాలో  సెంచరీలు నమోదు చేస్తూ ఉండటం గమనార్హం. ఇక ఇటీవలే రంజీ క్రికెట్ చరిత్రలోనే ఒక అరుదైన ఫీట్ నమోదయింది. జట్టులో ఉన్న టాప్ 9 ప్లేయర్స్ అందరూ కూడా హాఫ్ సెంచరీ చేయడం ద్వారా అరుదైన రికార్డు సాధించాడు. ఇటీవల రంజీ ట్రోఫీలో భాగంగా బెంగాల్ జార్ఖండ్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. తొలి క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో ఈ అద్భుత రికార్డు నమోదు కావడం గమనార్హం.

 అయితే ఫస్ట్ క్లాస్ క్రికెట్ చరిత్రలోనే ఇలా తొమ్మిది మంది బ్యాట్స్మెన్లు ఒకే ఇన్నింగ్స్ లో అర్థ సెంచరీ చేయడం మాత్రం ఇక క్రికెట్ చరిత్రలో ఇదే మొదటిసారి అని చెప్పాలి. ఇంతకుముందు 1893లో ఆస్ట్రేలియాకు చెందిన 8 మంది ఆటగాళ్లు కూడా హాఫ్ సెంచరీ చేసి అదరగొట్టారు. ఇంక ఇప్పుడు ఏకంగా తొమ్మిది మంది ప్లేయర్లు ఒకే మ్యాచ్లో అర్ద సెంచరీలు చేసి రికార్డు నమోదు చేశారు అని చెప్పాలి. హాఫ్ సెంచరీ చేసిన తొమ్మిది మందిలో  సుదీప్‌ గరామీ(380 బంతుల్లో 21 ఫోర్లు, ఒక సిక్సర్‌ సాయంతో 186 పరుగులు చేయగా, అనుస్తుప్‌ మజుందార్‌(194 బంతుల్లో 15 ఫోర్ల సాయంతో 117 పరుగులు చేసి సెంచరీలతో మెరిశారు..  ఇక ఓపెనర్లు అభిమన్యు ఈశ్వరన్‌ 65 పరుగులు చేయగా.. మరో ఓపెనర్‌ అభిషేక్‌ రమణ్‌ మొదట 41 పరుగుల వద్ద రిటైర్డ్‌హర్ట్‌గా వెనుదిరిగాడు. కానీ మజుందార్‌ ఔటైన తర్వాత మళ్లీ బ్యాటింగ్‌కు వచ్చి 61 పరుగులు చేసి వికెట్ కోల్పోయాడు.
 
ఇక ఐదో స్థానంలో వచ్చిన ఎంపీ మనోజ్‌ తివారి 73 పరుగులతో అదరగొట్టగా .. వికెట్‌ కీపర్‌ అభిషేక్‌ పొరేల్‌ 68 పరుగులు ఆకట్టుకున్నాడు.  షాబాజ్‌ అహ్మద్‌ 78 పరుగులు.. ఆ తర్వాత ఎనిమిది, తొమ్మిదో స్థానంలో వచ్చిన మోండల్‌ 53, ఆకాశ్‌దీప్‌  53 పరుగులు అదరగొట్టారు . ఇలా తొమ్మిది మంది బ్యాటర్లు  హాఫ్‌ సెంచరీ నమోదు చేయడంతో బెంగాల్‌ జట్టు 7 వికెట్ల నష్టానికి 773 పరుగులు భారీ స్కోరు వద్ద ఇన్నింగ్స్‌ డిక్లేర్‌ చేయటం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: