మెగా స్టార్, పవర్ స్టార్ ఓకే.. స్టేజ్ మీద డాన్స్ చేస్తే?

praveen
మెగా ఫ్యామిలీకి సంబంధించిన టాప్ హీరోలైన మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా పనిలేదు. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడు ఇండస్ట్రీకి పరిచయం అయినప్పటికీ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు పవన్ కళ్యాణ్. ఇక ఇప్పుడు మెగా ఫ్యామిలీలో పెద్ద హీరోలుగా కొనసాగుతూ ఉన్నారు. ఇక ఇద్దరు అన్నదమ్ములు కలిసి ఎక్కడైనా స్టేజ్ మీద కనిపించాడు అంటే చాలు అభిమానులు అందరూ కూడా ఎంతగానో మురిసిపోతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే.

 అయితే మెగాస్టార్ చిరంజీవి డాన్స్ లో కింగ్. తన డాన్సులతో టాలీవుడ్లో కొత్త ట్రెండ్ క్రియేట్ చేశాడు మెగాస్టార్ చిరంజీవి. ఇక తమ్ముడు పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే డాన్స్ చేసేది తక్కువ అయినా పవన్ కళ్యాణ్ చేసే చిన్న చిన్న మూమెంట్స్ కి సైతం ఫాన్స్ ఫిదా అయిపోతుంటారు. అలాంటిది ఇక మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి ఒకే స్టేజి మీద డాన్స్ చేస్తే అటు చూస్తున్న ప్రేక్షకులు అందరికీ కూడా కన్నులపండుగగా ఉంటుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇకపోతే ఇటీవల ఇలాంటిదే జరిగింది.

 ఏంటి మెగాస్టార్ చిరంజీవి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కలిసి ఒకే స్టేజి మీద డాన్స్ చేశారా అని అవాక్కవుతున్నారు కదా. అంత షాక్ అవ్వకండి. ఎందుకంటే నిజమైన పవర్ స్టార్ మెగాస్టార్ కాదు వారికి డూప్ లు ఇద్దరూ కలిసి ఇటీవల డాన్స్ చేశారు. ఇటీవల విడుదలైన ఢీ షో కి సంబంధించిన ప్రోమో కాస్త వైరల్ గా మారిపోయింది. ప్రోమో లో భాగంగా మెగాస్టార్ చిరంజీవి డూప్.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డూప్ ఇద్దరు కలిసి ఒక స్టేజ్ మీద డాన్స్ చేయడంతో నిజంగానే చిరు, పవన్ కలిసి డాన్స్ చేసారేమో అన్నంతగా ప్రేక్షకులు మైమరచిపోయారూ అని చెప్పాలి. పవన్ కళ్యాణ్ వీరాభిమాని అయిన ఢీ జడ్జ్ గణేష్ మాస్టర్ సైతం వీరిద్దరు డాన్స్ చేస్తూ ఉంటే ఫిదా అయిపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: