సమఉజ్జీలలో గెలుపెవరిది...రిషబ్ పంత్ కు అగ్ని పరీక్షే ?

VAMSI
సీజన్ ను ఘనంగా ఆరంభించిన ఢిల్లీ అడపా దడపా విజయాలు సాధిస్తూ ఒక మోస్తరు ప్రదర్శనను కనబరుస్తోంది. గత సంవత్సరం చూపించిన జోరును ఈ సీజన్ లో చూపించడంలో ఢిల్లీ క్యాపిటల్స్ మరియు కెప్టెన్ గా రిషబ్ పంత్ చూపించడంలో అంతగా సక్సెస్ కాలేదు అని చెప్పాలి. ఇక ఈ సీజన్ లో కనీసం ఢిల్లీ ప్లే ఆప్స్ కి అయినా చేరుతుందా అన్న సందేహంలో ఫ్యాన్స్ ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్ తాము ఆడిన 9 మ్యాచ్ లలో 4 మాత్రమే గెలిచి 4 గెలుచుకుంది. దీనితో పాయింట్ల పట్టికలో 7 వ స్థానంలో నిలిచింది. ఈ రోజు మ్యాచ్ లో ఖచ్చితంగా గెలిస్తేనే ప్లే ఆప్స్ పై ఆశలు ఉంటాయి. లేదంటే ఇంతకు ముందు ముంబై టీమ్ లాగా ఇంటి బాట పట్టడమే అంటున్నారు క్రికెట్ విశ్లేషకులు.

మరి ఈ రోజు జరుగుతున్న మ్యాచ్ లో మంచి ఊపుమీదున్న సన్ రైజర్స్ హైదరాబాద్ ను ఢిల్లీ ఢీకొడుతోంది. మొదట టాస్ గెలిచిన సన్ రైజర్స్ ఎప్పటిలాగే బౌలింగ్ ఎంచుకుంది. దీనితో ఢిల్లీ బ్యాటింగ్ లో తడబడుతోంది. మొదటి ఓవర్ లోనే మన్దీప్ సింగ్ వికెట్ మరియు ఆ తర్వాత కుదురుకున్నట్లే కనిపించిన మార్ష్ లు ఔట్ అవ్వడంతో, వార్నర్ మరియు రిషబ్ పంత్ లు పూర్తిగా ఆత్మ రక్షణలో పడిపోయి నెమ్మదిగా ఆడుతున్నారు. ఇక ఈ మ్యాచ్ లో ఎటువంటి పరిస్థితిలో గెలవాల్సి ఉండగా కనీసం 180 పరుగుల పైన లక్ష్యాన్ని నిర్దేశించాలి, లేదంటే సన్ రైజర్స్ కు ఉన్న బ్యాటింగ్ లైన్ అప్ ముందు డిపెండ్ చేయడం చాలా కష్టం అని చెప్పాలి.

ముఖ్యంగా పంత్, పావెల్ లు ఆఖరి వరకు వెయిట్ చేసి జట్టుకు విలువైన పరుగులు జోడించాల్సిన అవసరం ఉంది. ఏ విధంగా చూసుకున్నా కెప్టెన్ రిషబ్ పంత్ కు ఈ పరీక్ష ఒక అగ్నిపరీక్ష అని చెప్పాలి. మరి ఈ పరీక్షలో పంత్ అండ్ టీమ్ నెగ్గుతారా లేదా మరో విజయాన్ని సన్ రైజర్స్ కు అప్పగిస్తారా అన్నది తెలియాలంటే మరో కొంత సమయం వేచి చూడాల్సిందే.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: