చరిత్ర సృష్టించిన గుజరాత్.. ఐపీఎల్ లో ఏకైక జట్టు?
ప్రత్యర్థి ఎవరైనా సరే చిత్తుగా ఓడిస్తూ విజయఢంకా మోగించి దూసుకుపోతోంది. ఈ సీజన్ ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటి వరకు ఇక వరుస విజయాలతో దూసుకుపోతుంది. ఇప్పుడు వరకు తొమ్మిది మ్యాచ్లు ఆడిన గుజరాత్ టైటాన్స్ ఎనిమిది మ్యాచ్ లలో విజయం సాధించింది అని చెప్పాలి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు జరిగిన మ్యాచుతో ఏకంగా ఎనిమిదో విజయాన్ని నమోదు చేసింది గుజరాత్ టైటాన్స్ జట్టు. దీంతో ఇక హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ కి తిరుగు లేదు అంటూ ఎంతో మంది ప్రశంసలు కురిపిస్తున్నారు అని చెప్పాలి.
ఈ క్రమంలోనే ఇటీవల రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో జరిగిన మ్యాచ్లో అద్భుతమైన విజయాన్ని సాధించింది గుజరాత్ జట్టు. 6 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని సాధించడమే కాదు ఒక సరికొత్త చరిత్ర సృష్టించింది. ఇప్పటివరకు ఐపీఎల్ లో ఆడిన తొమ్మిది మ్యాచ్ లలో 8 విజయాలు సాధించిన ఏకైక జట్టుగా గుజరాత్ నిలిచింది. సన్రైజర్స్ హైదరాబాద్ లో జరిగిన ఒక మ్యాచ్లో మాత్రమే ఇప్పటివరకు గుజరాత్ ఓడింది అన్న విషయం తెలిసిందే. ఇక ఈ సీజన్లో అన్ని జట్ల కంటే ఎంతో బలమైన జట్టుగా కూడా కొనసాగుతోంది గుజరాత్. ఇక గుజరాత్ జోరు చూస్తూ ఉంటే ఈసారి కప్పు కొట్టడం పక్క అని అందరూ నమ్ముతున్నారు..