ఐపీఎల్ : పర్పుల్ క్యాప్ రేసులో ఉన్న బౌలర్లు వీరే?

praveen
టి20 ఫార్మాట్ అంటేనే బ్యాట్ కి బంతి కి మధ్య జరిగే హోరాహోరీ యుద్ధం. గంటల్లో తేలే పలితం.. ప్రతి ఆటగాడికి ప్రతిభకు ఊహించని సవాల్.. ఇక ప్రతీ మ్యాచ్ చావో రేవో అన్నట్లుగా అనే ఉత్కంఠ భరితంగా మారిపోతూ ఉంటుంది. అందుకే క్రికెట్ ప్రేక్షకులందరికీ పొట్టి ఫార్మాట్ గా పిలుచుకునే టీ-20 ఫార్మెట్ తెగనచేస్తూ ఉంటుంది. ఇక ఐపీఎల్ అయితే మరింతగా అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటుంది. ఎందుకంటే అంతర్జాతీయ క్రికెట్లో కేవలం ప్రత్యర్థులుగా ఉన్న వారు ఐపీఎల్లో సహచరులుగా మారి పోతూ ఉంటారు.

 దీంతో అప్పటివరకు సహచరులుగా ఉన్న ఆటగాళ్ల తోనే హోరాహోరీగా పోరాడాల్సి ఉంటుంది క్రికెట్ ప్లేయర్స్. సాధారణంగా టి20 ఫార్మాట్లో కేవలం బ్యాట్స్ మెన్ లది మాత్రమే ఆదిపత్యం కొనసాగుతూ ఉంటుంది అని చెబుతూ ఉంటారు. సిక్సర్లు ఫోర్లు తో రెచ్చిపోతూ ఇక భారీగా పరుగులు చేస్తూ ఇక బౌలర్లపై విరుచుకుపడ్డ ఉంటారు అని అంటూ వుంటారు. కానీ కొన్నిసార్లు మాత్రం బౌలర్లు కూడా తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ ఉంటారు. ఇక క్లిష్ట పరిస్థితుల్లో కూడా వికెట్లు పడగొడుతూ సత్తా చాటుతూ ఉంటారు.  ఇలా ఈ ఏడాది ఐపీఎల్ లో అత్యధిక వికెట్లు తీసి పర్పుల్ క్యాప్ రేసులో ఉన్న ఆటగాళ్లు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.

 రాజస్థాన్ రాయల్స్ జట్టులో కొనసాగుతోన్న యుజ్వేంద్ర చాహల్ ఇటీవలే కోల్కత్త తో జరిగిన మ్యాచ్ లో తన స్పిన్ బౌలింగ్ తో మ్యాజిక్ చేశాడు. హ్యాట్రిక్ వికెట్స్ తీయడమే కాదు మ్యాచ్ మొత్తంలో 5 వికెట్లు హాల్ అందుకున్నాడు. దీంతో ప్రస్తుతం 17 వికెట్లతో పర్పుల్ క్యాప్ సొంతం చేసుకున్న ఆటగాడిగా ఉన్నాడు. తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్ కుల్దీప్ యాదవ్ 13 వికెట్లతో రెండవ స్థానంలో ఉన్నాడు. ఫాస్ట్ బౌలర్ నటరాజన్ 12 వికెట్లతో మూడవ స్థానంలో.. చెన్నై బౌలర్ బ్రావో 12 వికెట్లతో నాలుగవ స్థానంలో, వనిందు హసరంగా ఆర్సిబి కి ప్రాతినిధ్యం వహిస్తూ 11వ స్థానంలో ఉన్నాడు. ఆవేశ్ ఖాన్ లక్నో  జట్టు తరఫున 11 వికెట్లు తీశాడు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: