అద్భుతమైన ఫామ్ లో బట్లర్.. కోహ్లీ రికార్డ్ తుడిచేస్తాడా?

praveen
సాధారణంగా టీ20 ఫార్మాట్ అంటేనే బ్యాట్మెన్ల ఆధిపత్యం కొనసాగుతూనే ఉంటుంది. అయితే ఈ ఆధిపత్యం అన్నివేళలా వర్తించదు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఎందుకంటే కొన్ని కొన్ని సార్లు అటు బౌలర్లు కూడా హవా కొనసాగిస్తు ఉంటారు. అయితే కేవలం 120 బంతులు మాత్రమే ఉండే పొట్టి ఫార్మాట్లోనూ కేవలం అర్థ సెంచరీ చేస్తే గొప్ప విషయం అని అంటూ ఉంటారు. కానీ సెంచరీ కొడితే ప్రశంశల వర్షం కురుస్తుంది. ఇక ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ లో ఎంతో మంది ఆటగాళ్లు అద్భుతమైన ఫామ్లో కొనసాగుతూ సెంచరీలతో అదరగొడుతూ ఉన్నారు.

 ఈ క్రమంలోనే ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్ జట్టు తరపున కొనసాగుతున్న జోస్ బట్లర్ అరుదైన రికార్డును సాధించే దిశగా దూసుకుపోతున్నాడు అని చెప్పాలి. ఇక ప్రస్తుతం జోష్ బట్లర్ రెండు సెంచరీలతో అదరగొట్టారు. ఇక మరో రెండు సెంచరీలు చేశాడు అంటే విరాట్ కోహ్లీ రికార్డులు బ్రేక్ చేయబోతున్నాడు. అప్పట్లో విరాట్ కోహ్లీ ఫామ్ లో ఉన్న రోజులు ఏ ఫార్మాట్ కైనా సరే పరుగుల వరద పారించటమే పనిగా పెట్టుకున్నాడు. ఇక ఎంతటి భీకరమైన బౌలర్ బంతులు వేసిన వెనకడుగు వేయకుండా భారీగా పరుగులు చేశాడు. 2016 ఐపీఎల్ లో 16  మ్యాచ్ లు ఆడిన విరాట్ కోహ్లీ 152.04 స్ట్రైక్ రేట్ తో  నాలుగు శతకాలు 7 అర్ద శతకాలతో 973 పరుగులు చేశాడు.

 ఇప్పటికి కూడా ఐపీఎల్ హిస్టరీ లో ఇదే రికార్డు అని చెప్పాలి. ప్రతి బంతిని బౌండరీకి తరలించడమే లక్ష్యంగా ప్రస్తుతం జోస్ బట్లర్ రెచ్చిపోతున్నాడు. ఇప్పటివరకు ఐపీఎల్లో ఎక్కువ పరుగులు సాధించిన జాబితాలో ఈ సీజన్ లో టాప్ లో ఉన్నాడు  అంతే కాదు రెండు శతకాలు సాధించిన బ్యాట్స్మన్గా కొనసాగుతున్నాడు. ముంబై 69 బంతుల్లో వంద పరుగులు.. కోల్కతాపై 61 బంతుల్లో 103 పరుగులు చేశాడు. పాకిస్థాన్ జట్టు లీగ్ దశలో ఏకంగా 8 మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. జోస్ బట్లర్ కోహ్లీ రికార్డు బ్రేక్ చేస్తుందా లేదా అని చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: