ఐపీఎల్లో 4వ ప్లేయర్.. సన్రైజర్స్ బౌలర్ అరుదైన రికార్డు?

praveen
ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ లో ఎంతో మంది బౌలర్లు తమ అద్భుతమైన బౌలింగ్ తో సత్తా చాటుతున్నారు. కానీ ఎక్కువమంది చర్చించుకుంటూ ఉంది మాత్రం ఒక్క బౌలర్  గురించే. అతను బౌలింగ్ చేస్తున్నాడు అంటే చాలు బ్యాట్స్మెన్ల వెన్నులో వణుకు పుడుతుంది. ఎందుకంటే ఆ వేగాన్ని తట్టుకోగలమా అని.. ఇక అతను బంతులు విసురుతున్నాడు అంటే వికెట్ల వెనకాల ఉన్న కీపర్ కూడా భయపడే పోతాడు. ఎందుకంటే అంత వేగమైన బంతులను చేతిలో ఒడిసి పట్టుకోగలమా అని.. బుల్లెట్ లాంటి బంతులు విసురుతూ ప్రస్తుతం బ్యాట్స్మెన్లకు ముచ్చెమటలు పట్టిస్తూ  జట్టు విజయంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు ఆ బౌలర్. ప్రతి మ్యాచ్లో కూడా అదే రీతిలో రాణిస్తూ అదరగొడుతున్నాడు. అతను ఎవరో కాదు సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు బౌలర్ ఉమ్రాన్ మాలిక్.

 ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన బంతులను విసురుతూ సరికొత్త చరిత్ర సృష్టిస్తున్నాడు. ఇక సన్రైజర్స్ ఏదైనా జట్టుతో మ్యాచ్ ఆడింది అంటే చాలు ఆ మ్యాచ్ మొత్తంలో అతని కంటే వేగంగా బంతులు విసిరే బౌలర్లు ఎక్కడా కనిపించడం లేదు అని చెప్పాలి. ఇటీవలే పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు తమ నాలుగో విజయాన్ని సాధించింది. ఈ క్రమంలోనే అటు ఉమ్రాన్ మాలిక్ కూడా ఒక అరుదైన ఫీట్ సాధించాడు అని చెప్పాలి. మెరుపు కంటే వేగవంతమైన బంతులను విసురుతూ బ్యాట్స్మెన్లను ముప్పుతిప్పలు పెట్టిన మాలిక్ కీలకమైన 20 ఓవర్ లో కూడా అద్భుతంగా బౌలింగ్ చేశాడు.

 సాధారణంగా 20వ ఓవర్ లో  ఎలా బంతిని వేసిన బౌండరీకి తరలించాలి అని బ్యాట్స్మెన్ అనుకుంటూ ఉంటాడు. కానీ ఉమ్రాన్ మాలిక్ 20 ఓవర్ లో సైతం మేడిన్ వేసి ఒక రనౌట్ మూడు వికెట్లను ఖాతాలో వేసుకున్నాడు. తన కెరీర్లోనే బెస్ట్ గణాంకాలను నమోదు చేశాడు. ఈ క్రమంలోనే అరుదైన రికార్డును సృష్టించాడు. ఐపీఎల్ లో ఒక ఇన్నింగ్స్ లో ఆఖరి ఓవర్ మేడిన్ గా వేసిన నాలుగో బౌలర్ గా రికార్డు సృష్టించాడు ఉమ్రాన్ మాలిక్.  ఇంతకుముందే ముందు 2018 సీజన్లో ముంబై ఇండియన్స్ పై ఇర్ఫాన్ పఠాన్, 2008 లో డెక్కన్ చార్జెస్  మలింగా, 2017లో సన్రైజర్స్ పై జయదేవ్ ఉనాద్కట్ ఇలాంటి అరుదైన రికార్డు సాధించారు. ఇప్పుడు ఈ రికార్డు ఖాతాలో వేసుకున్నాడు మాలిక్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: