అప్పుడు ధోని.. ఇప్పుడు తేవాటియా.. బలైంది మాత్రం పంజాబ్?

praveen
ఆఖరి బంతికి సిక్సర్ కొట్టి ఇక జట్టుకు విజయాన్ని అందించటం అంటే ఆ కిక్కే వేరప్పా అంటూ ఉంటారు క్రికెట్ ప్రేక్షకులు. ఇక ప్రతి మ్యాచ్లో కూడా టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఇక సిక్సర్ తో నే మ్యాచ్ ముగిస్తూ అందరికీ ఇలాంటి కిక్ పంచేవాడు. ఇక ఒక బంతికి ఆరు పరుగులు గా సమీకరణం ఉన్నప్పుడు సిక్సర్ కొడితే ఇక అతని పేరు ఎంతలా మార్మోగిపోతోంది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక అలాంటిది రెండు బంతుల్లో 12 పరుగులు చేయాల్సి ఉన్న సమయంలో ఒత్తిడిని జయించి రెండు బంతులను సిక్సర్లుగా మలిచటం అది ప్రతి ఒక్కరికి సాధ్యమయ్యే పని కాదు.

 ఇక ఇలాంటివి చాలా అరుదుగా కూడా జరుగుతూ ఉంటాయి. అయితే ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో మాత్రం ఇలాంటి అద్భుతాలు రెండు సార్లు చోటు చేసుకోవడం గమనార్హం. ఒకప్పుడు మహేంద్ర సింగ్ ధోనీ ఇలా రెండు బంతుల్లో  12 పరుగులు చేయాల్సి ఉన్న సమయంలో రెండు సిక్సర్లు కొడితే ఇక ఇప్పుడు గుజరాత్ టైటాన్స్ ఆల్ రౌండర్ రాహుల్ తేవాటియా ఇక ఈ అద్భుతమైన ఫీట్ చేసి చూపించాడు. రెండుసార్లు ఇలా సిక్సర్లతో ఓటమి చవిచూసింది మాత్రం పంజాబ్ జట్టు కావడం గమనార్హం. ఇటీవలే పంజాబ్ టీం గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఎంతో ఉత్కంఠ భరితంగా జరిగిన మ్యాచ్లో రాహుల్ తేవాటియా హీరోగా నిలిచాడు.

 190 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగింది గుజరాత్ టైటాన్స్ ఎంతో ఉత్కంఠ భరితంగా జరిగిన మ్యాచ్లో ఆఖరి రెండు బంతుల్లో 12 పరుగులు కావాల్సి ఉంది. ఈ క్రమంలోనే బ్యాటింగ్ చేస్తున్న రాహుల్ తేవాటియా రెండు సిక్సర్లు బాది తన జట్టుకు తిరుగులేని విజయాన్ని అందించాడు. ఐపీఎల్లో ఇలా జరగడం ఇది రెండవ సారి. 2016 ఐపీఎల్ సీజన్ లో భాగంగా పూనే రైజింగ్ జెయింట్స్ కింగ్స్ లెవెన్ పంజాబ్ మధ్య మ్యాచ్  జరిగింది. ఆ సమయంలో చివరి రెండు బంతులకు 12 పరుగులు చేయాల్సి ఉన్న సమయంలో ధోని అద్భుతంగా రెండు సిక్సర్లు కొట్టి ఇక జట్టుకు విజయాన్ని అందించాడు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: