అంపైర్ తో పనిలేదు.. అతనికి అన్నీ తెలుసు?
చివర్లో వచ్చిన దినేష్ కార్తీక్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడటంతో ఇక రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు విజయం వరించింది. అదే సమయంలో వరుస విజయాలతో దూకుడు మీద ఉన్న రాజస్థాన్ రాయల్స్ జట్టుకు బెంగళూరు జట్టు కళ్లెం వేసింది అని చెప్పాలి. ఇక పోతే ఇక ఈ మ్యాచ్ లో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. రాజస్థాన్ ఇన్నింగ్స్ 15 ఓవర్ లో హర్షల్ పటేల్ బౌలింగ్ వేసాడు. అయితే ఆ ఓవర్ నాలుగో బంతిని హర్షల్ పటేల్ అద్భుతమైన స్లో యర్కర్ వేసాడు. ఇక ఈ బంతి నేరుగా బట్లర్ ప్యాడ్ లకు తాకింది. ఇక బెంగుళూరు ఆటగాళ్లు అప్పీల్ చేయడంతో అంపైర్ అవుట్ గా ప్రకటించాడు.
కానీ అటు బట్లర్ మాత్రం క్రీజు నుంచి కదల్లేదు. ఎందుకంటే అది అవుట్ కాదని బట్లర్ కి ముందే తెలుసు. ఎందుకంటే బట్లర్ ప్యాడ్ లను తాగడానికి ముందే బంతి బ్యాట్ కీ తాకింది. కానీ అది గమనించకుండా అవుట్ ఇచ్చేసాడు అంపైర్. దీంతో వెంటనే బట్లర్ రివ్యూ కి వెళ్ళాడు. ఇక అల్ట్రా ఎడ్జ్ సౌండ్ లో చెక్ చేస్తే బంతి ప్యాడ్ లను తాగడానికి ముందే బ్యాట్ ను తాకినట్లు తేలింది. దీంతో అంపైర్ తన తప్పును తెలుసుకొని బట్లర్ ను నాటౌట్గా ప్రకటించాడు. ఇక ఇది చూసిన అభిమానులు అందరూ కూడా బట్లర్ కూ కాన్ఫిడెంట్ కి ఫిదా అయిపోయా.. అతనికి అంపైర్ తో పనిలేదు అన్నీ తెలుసు అంటు అందుకే క్రీజు నుండి కదల్లేదు అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు అభిమానులు..