టీమిండియాకి మంచి బ్యాట్స్మెన్ దొరికేసాడు : కేఎల్ రాహుల్

praveen
సాధారణంగా ఐపిఎల్ అంటేనే యువ ప్లేయర్లకు సత్తా చాటే మంచి ప్లాట్ఫాం. సీనియర్ ప్లేయర్లు ఎలాగో అప్పటికి అంతర్జాతీయ క్రికెట్ లో తమ సత్తా ఏంటో నిరూపించుకొని ఉంటారు. ఇక భారీగా పరుగులు చేసి రికార్డు కొల్లగొట్టి ఉంటారు. కానీ యువ ఆటగాళ్లు మాత్రం అంతర్జాతీయ జట్టులో అవకాశం దక్కించుకోవాలని ఆత్రుతగా ఎదురు చూస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఐపీఎల్ లో బాగా రాణించి సత్తా చాటాలి అని అనుకుంటూ ఉంటారు. ఇక ఇప్పటికే ఎంతోమంది యువ ఆటగాళ్లు ఐపీఎల్లో ద్వారా భారత అంతర్జాతీయ జట్టులో స్థానం దక్కించుకున్న వారు ఉన్నారు.

 ఇక ఈ ఏడాది ఐపిఎల్ సీజన్ ప్రారంభమైంది. ఇక ఈ సీజన్ లో ప్రతి మ్యాచ్ లో కూడా ఒక సరికొత్త యువ ఆటగాడు తెరమీదికి వస్తు మంచి ప్రదర్శన కనబరుస్తూ ఉన్నాడు. ఈ క్రమంలోనే లక్నో జట్టులో యువ ఆటగాడు ఆయుష్ బాదోని మంచి ప్రదర్శన కనబరిచాడు.  ఇటీవలే లక్నో సూపర్ జెయింట్స్ సారథి కె.ఎల్.రాహుల్ అతనిపై ప్రశంసలు కురిపించాడు. ఆయుష్ బాదోని రూపంలో టీమిండియా జట్టుకు ఒక మంచి బ్యాట్స్మెన్ దొరికినట్లే అంటూ వ్యాఖ్యానించాడు కె.ఎల్.రాహుల్. 360 డిగ్రీలలో ఆడ గలిగే సామర్థ్యం అతని సొంతమని రాహుల్ చెప్పుకొచ్చాడు.

 అయితే బాదోని మొదటి మ్యాచ్ నుంచి బాగా రాణిస్తున్నాడు అన్న విషయం తెలిసిందే. గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ లో ఏకంగా అర్థ సెంచరీ చేసి అందరి దృష్టిని తన వైపుకు తిప్పుకున్న యువ ఆటగాడు ఇటీవలే చెన్నైలో జరిగిన మ్యాచ్ లో భారీ లక్ష్య ఛేదనలో 9 బంతుల్లో 19 పరుగులు చేశాడు అదరగొట్టాడు.  ఆయుష్ బాదోని  ఆడటంకు సంబంధించిన కొన్ని వీడియోలను చూసాను.. అయితే అతను కొన్ని అసాధారణమైన షాట్లు కొట్టాడు 360 డిగ్రీ లలో కూడా అద్భుతంగా ఆడాడు.  భారత్ కి దొరికిన మంచి ప్లేయర్  అతను. అలాగే రవి బిష్ణయ్ కూడా మంచి పోరాట స్ఫూర్తి ఉన్నవాడు అంటూ చెప్పుకొచ్చాడు కేఎల్ రాహుల్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: