చెన్నై పై విజయం.. లక్నో అరుదైన రికార్డు?

praveen
ఐపీఎల్ లో ప్రతి మ్యాచ్ కూడా ఎంతో ఉత్కంఠభరితంగా మారిపోయింది. ఇక ప్రతి మ్యాచ్లో కూడా ఒక జట్టు భారీ స్కోరు చేయడం ఇక ఆ తర్వాత బ్యాటింగ్ చేస్తున్న జట్టు ఎంతో అలవోకగా భారీ టార్గెట్ ను చేదించడం లాంటివి జరుగుతూ ఉంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం ప్రతి మ్యాచ్ కూడా ప్రేక్షకులను టీవీలకు అతుక్కుపోయేలా చేస్తోంది. అయితే ఐపీఎల్ లోకి కొత్తగా ఎంట్రీ ఇచ్చిన లక్నో సూపర్ జెయింట్స్ జట్టు ఇక ఐపీఎల్ లో తన తొలి విజయాన్ని నమోదు చేసింది. ఐపీఎల్ 2022 సీజన్ లో భాగంగా మొదట గుజరాత్ టైటాన్స్ జట్టుతో తలపడింది లక్నో. ఈ మ్యాచ్ లో ఓడిపోయింది.

 కాగా నిన్న డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ తో మ్యాచ్ జరగా ఏకంగా అద్భుతమైన ప్రదర్శన చేసి ఆరు వికెట్ల తేడాతో గెలుపొందింది. అయితే ఇక ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై భారీ లక్ష్యాన్ని లక్నో జట్టు ముందు ఉంచింది. అయితే లక్నో జుట్టు మాత్రం ఎక్కడా తడబడకుండా లక్ష్యాన్ని ఛేదించి ప్రత్యర్థికి ఊహించని షాక్ ఇచ్చింది. ఐపీఎల్ చరిత్రలో భారీ టార్గెట్ ను విజయవంతంగా ఛేదించిన నాలుగవ జట్టుగా లక్నో రికార్డును సొంతం చేసుకుంది. బ్రబోర్న్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్లో ఇక నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 210 పరుగుల చేసింది చెన్నై సూపర్ కింగ్స్.

 ఈ క్రమంలోనే ఆ తర్వాత లక్నో జట్టు ఇంత భారీ టార్గెట్ చేధిస్తుందా లేదా అని అనుమానాలు నెలకొన్నాయి. ఇక మొదటి నుంచి లక్నో బ్యాట్స్మెన్లు ఎంతో దూకుడు గానే ఆడారు. ఇక ఈ మ్యాచ్ చివరి ఓవర్ వరకు చేరుకుంది  దీంతో ఉత్కంఠ మరింత పెరిగిపోయింది. ఇక చివరి ఓవర్లో లక్నో యువ సంచలనం ఆయుష్ బాదోని సింగిల్ తీసి తన జట్టుకు విజయాన్ని ఖరారు చేశాడు. ఇలా రెండవ మ్యాచ్లోనే లక్నో జట్టుకు ఏకంగా ఐపీఎల్ చరిత్రలోనే గుర్తుండిపోయే విజయం దక్కడంతో అభిమానులు అందరూ కూడా ఆనందంలో మునిగిపోయారు. కాగా చెన్నై వరుసగా రెండవ ఓటమి చవిచూసింది అన్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: