ఐపీఎల్ 2022: శ్రేయస్ అయ్యర్ VS రవీంద్ర జడేజా... గెలుపెవరిది ?
ఈ సంవత్సరం ఫిబ్రవరిలో జరిగిన మెగా వేలంలో కోల్కతా ఫ్రాంచైజీ ఢిల్లీ ప్లేయర్ శ్రేయాస్ అయ్యర్ ను కొనుక్కుని తమ కొత్త కెప్టెన్ గా ప్రకటించింది. ఇక ఈ సీజన్ కు కూడా చెన్నై కి కెప్టెన్ గా ఎమ్మెస్ ధోనీ నే కెప్టెన్ గా ఉంటాడని ఊహించిన అభిమానులకు నిన్న మధ్యాహ్నం ఊహించని షాక్ ఇచ్చాడు. ధోనీ కెప్టెన్ గా తొలగిపోతున్నట్లు ప్రకటించి ఆశ్చర్యపరిచాడు. దానితో చెన్నై యాజమాన్యం తమ నూతన కెప్టెన్ గా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా ను నియమించింది. దీనితో వీరిద్దరూ మొదటి సారి తమ జట్లకు కెప్టెన్ గా బాధ్యత వహిస్తున్నారు. కాబట్టి ఎవరు ఈ మ్యాచ్ లో విజయం సాధిస్తారు అన్నది తెలియాలంటే రేపటి వరకు ఆగాల్సిందే.
కానీ క్రికెట్ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం చూస్తే చెన్నైనే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది. అయితే ఐపీఎల్ సీజన్ 15 లో గెలుపు ఏ జట్టును వరిస్తుందో చూడాలి. కానీ ఎప్పటిలాగే ఈ స్టేడియం చేజింగ్ కు అనుకూలిస్తుందని తెలుస్తోంది.