అప్పుడు బాహుబలి.. ఇప్పుడు ధోని.. ఆసక్తికర పోస్ట్?

praveen
మహేంద్ర సింగ్ ధోనీ.. ఇక ఇప్పుడు ఈ పేరు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది. దీనికి కారణం ఇటీవల ధోని తీసుకున్న నిర్ణయం. అప్పట్లో మహేంద్రసింగ్ ధోని  అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించడం ఎంత సంచలనంగా మారిపోయింది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ధోని మళ్ళీ ఫాంలోకి వస్తాడని అద్భుతంగా రాణిస్తాడని ఇక జట్టు విజయంలో కీలక పాత్ర పోషిస్తాడని ఎంతోమంది అనుకున్నారు. కానీ కొన్నాళ్ళపాటు క్రికెట్కు దూరమైన మహేంద్ర సింగ్ ధోనీ ఇక ఎవరూ ఊహించని విధంగా అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. దీంతో అభిమానులు అందరూ కూడా నిరాశలో మునిగిపోయారు.

 అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ అటు ఐపీఎల్ లో మాత్రం చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ గా కొనసాగుతూ వస్తున్నాడు. అయితే మహేంద్ర సింగ్ ధోనీ చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఎంతో సమర్థవంతంగా ముందుకు నడిపిస్తున్నాడు. గత ఏడాది చెన్నై జట్టుకు టైటిల్ కూడా అందించాడు అని అని చెప్పాలి. అలాంటి మహేంద్ర సింగ్ ధోనీ ఇటీవలే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఏకంగా తాను చెన్నై సూపర్ కింగ్స్ సారథ్య బాధ్యతల నుంచి కూడా తప్పుకుంటున్నా అంటూ ప్రకటించింది అభిమానులకు షాక్ ఇచ్చాడు. దీంతో ధోనీ ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నాడు అన్న దానిపై అభిమానులు చర్చించుకుంటున్నారు.

 ఇక ఎంతో మంది మాజీ క్రికెటర్లు సైతం ఈ విషయంపై స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇదే విషయంపై మాజీ క్రికెటర్ వసీం జాఫర్ స్పందిస్తూ కాస్త వెరైటీగా ఒక పోస్టు పెట్టాడు. ఈ పోస్టు కాస్త వైరల్ గా మారిపోయింది. బాహుబలి సినిమాకు సంబంధించిన ఒక వీడియో ని పోస్ట్ చేశాడు. బాహుబలి సినిమాలో ప్రభాస్ రాజ్యాన్ని వదిలి ప్రజల్లోకి వెళ్తున్న సమయంలో ప్రజలు ఎంతగానో బాధపడిపోతుంటారు. ఇక అదే సమయంలో దండాలయ్య దండాలయ్య అంటూ పాట సాగుతూ ఉంటుంది. ఇప్పుడు బాహుబలిని ధోనీ తో పోలుస్తూ నాయకత్వం వదిలేసి నప్పటికీ మహేంద్రసింగ్ ధోని ఆటగాడిగా కొనసాగుతాడని తెలిపాడు ధోని.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: