ప్చ్.. రహనే మారలేదబ్బా?
రంజీ ట్రోఫీలో ఆడి ఫామ్ నిరూపించుకోవాలి అంటూ బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ సూచించాడు. ఈ క్రమంలోనే ప్రస్తుతం సీనియర్ క్రికెటర్లుగా ఉన్న అజింక్య రహానే తో పాటు పుజారా కూడా రంజీ ట్రోఫీలో ఆడుతున్నారు. ఇకపోతే ఇటీవల రంజీ ట్రోఫీలో భాగంగా అద్భుతమైన సెంచరీ చేసిన అజింక్య రహానే మళ్లీ ఫుల్ ఫామ్ లోకి వచ్చాడు అన్నట్లుగానే కనిపించాడు. అజింక్య రహానే ను మళ్లీ జట్టులోకి తీసుకోవడం ఖాయమని అభిమానులు కూడా ఫిక్స్ అయ్యారు.
కానీ ఇటీవలే మరో సారి పేలవమైన ఫామ్ తో నిరాశ పరిచాడు అజింక్యా రహానే. ఇటీవలే జట్టు నుంచి ఉద్వాసనకు గురైన తర్వాత ఆడిన తొలి మ్యాచ్లో తీవ్రంగా నిరాశ పరిచాడు. రంజీ ట్రోఫీలో భాగంగా గోవా జట్టుతో ముంబై జట్టు తలపడుతుంది. ఈ మ్యాచ్లో తొలి ఇన్నింగ్స్లో అజింక్య రహానే డకౌట్ గా వెనుదిరిగాడు. పదవ ఓవర్ లో వేసిన లక్షా గార్గ్ బౌలింగ్ లో రహానే ఎల్బీడబ్ల్యు రూపంలో పెవిలియన్ చేరాడు. అయితే భారత జట్టులో చోటు దక్కించుకోవాలంటే మళ్ళీ తన ఫామ్ నిరూపించుకోవాల్సిన సమయంలో ఇక ఈ సీనియర్ బ్యాట్స్మెన్ మాత్రం మళ్లీ పేలవమైన ప్రదర్శన చేయడంతో అభిమానులు అందరూ నిరాశలో మునిగిపోతున్నారు. గతంలో సెంచరీతో ఫాంలోకి వచ్చినట్లు అనిపించింది. ఇక ఇప్పుడు మళ్లీ డక్ ఔట్ కావడం మాత్రం అభిమానులను నిరాశ పరుస్తోంది.