యష్ దుల్ సంచలనం.. అరుదైన రికార్డ్?

praveen
ఇటీవలి కాలంలో ఎంతోమంది యువ ఆటగాళ్లు క్రికెట్ లో ఎంత అద్భుతంగా రాణిస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. భారత అంతర్జాతీయ జట్టులో చోటు కోసం వచ్చిన అవకాశాన్ని కూడా వినియోగించుకుని అద్భుతమైన ప్రదర్శన తో ఆకట్టుకుంటున్నారూ. అంతేకాదు ఇక భారత క్రికెట్లో ఫ్యూచర్స్ స్టార్స్ మేమే అన్న విధంగా బ్యాటింగ్ బౌలింగ్ తో అదరగొడుతున్నారు. ఇకపోతే అండర్ 19 జట్టును కెప్టెన్గా ఎంతో సమర్థవంతంగా ముందుకు నడిపించి  ఇక భారత జట్టును విశ్వవిజేతగా నిలిపాడు కెప్టెన్ యష్ దుల్.


 నిన్నటి వరకు అండర్ 19 జట్టుకు మాత్రమే పరిమితమైన యష్ దుల్ ఇక ఇటీవలే రంజీ ట్రోఫీ ద్వారా తన క్రికెట్ కెరీర్ ప్రారంభించాడు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తన అరంగేట్రం మ్యాచ్ లలోనే సెంచరీలు మోత మోగిస్తున్నాడు ఈ యువ ఆటగాడు. అంతేకాదు  సెలెక్టర్ల చూపును తనవైపు ఆకర్షిస్తున్నాడు. రంజీ ట్రోఫీలో భాగంగా ఇటీవల ఢిల్లీ తమిళనాడు జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. అయితే ఈ మ్యాచ్ డ్రాగా ముగిసింది  అయితే తొలి ఇన్నింగ్స్ లో సెంచరీ సాధించి తన ఫస్ట్ క్లాస్ క్రికెట్ కెరీర్లో డబ్ల్యూ మ్యాచ్ ని అదరగొట్టిన యష్ దుల్ ఇక రెండవ ఇన్నింగ్స్ లో కూడా సెంచరీ సాధించి తనకు తిరుగులేదని నిరూపించుకున్నాడు


 వరుసగా రెండు ఇన్నింగ్స్ లో రెండు సెంచరీలు సాధించి ఒక అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. రంజీ ట్రోఫీ అరంగేట్రం మ్యాచ్ లోని రెండు ఇన్నింగ్స్ లో సెంచరీ సాధించిన మూడవ ఆటగాడిగా  రికార్డు సృష్టించాడు.  అంతకుముందు గుజరాత్ బ్యాట్స్మెన్ నారి కాంట్రాక్టర్ ఈ ఫీట్ సాధించిన మొదటి వ్యక్తిగా నిలిచాడు. ఇక మహారాష్ట్ర బ్యాట్స్మెన్ విరాగ్ ఇక ఇలా రెండు ఇన్నింగ్స్ లో రెండు సెంచరీలు చేసిన ఆటగాడిగా ఉన్నాడు. కాగా నారీ కాంట్రాక్టర్ 1952- 53 రంజీ ట్రోఫీలో రికార్డు సాధిస్తే.. 2012- 13 సీజన్లలో విరాగ్  ఈ ఫీట్ సాధించాడు. ఇక ఇప్పుడు ఈ అరుదైన రికార్డు సాధించిన ఆటగాడిగా నిలిచాడు యష్ దుల్. ప్రస్తుతం ఐపీఎల్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తరఫున కొనసాగుతున్నారు ఈ యువ ఆటగాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: