CSK క్రికెటర్ పై చర్యలు తీసుకోండి.. బీసీసీఐకి లేఖ?

praveen
సాధారణంగా ప్రతి క్రికెటర్ అండర్ 19 జట్టులో కొనసాగుతూ అక్కడ అద్భుత ప్రదర్శన చేసి ఆ తర్వాత అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగు పెట్టాలి అని అనుకుంటూ ఉంటాడు. ప్రస్తుతం భారత జట్టులో కొనసాగుతోన్న స్టార్లు అందరూ కూడా ఒకప్పుడు అండర్ 19 జట్టులి అద్భుతంగా రాణించిన వారరే. అండర్-19 జట్టు లో రాణించిన తర్వాత  ఫస్ట్ క్లాస్ క్రికెట్ కెరీర్ మొదలు పెడుతూ ఉంటారు. ఇలా ఒక్కో మెట్టు ఎక్కుతూ చివరికి అంతర్జాతీయ క్రికెట్లో చోటు సంపాదించుకుంటూ  ఉంటారు. ఇకపోతే అండర్ 19 జట్టులో స్థానం దక్కించుకోవాలి అంటే ప్రతి ఆటగాడు వయసు 19 ఏళ్ల లోపే ఉండాలి అన్న విషయం తెలిసిందే.

 19 ఏళ్ల పైబడిన ఆటగాళ్లు ఎవరిని కూడా 19 ఆటగాడిగా పరిగణలోకి తీసుకోరు. ఇక అలాంటి ఆటగాళ్లు ఎవరైనా ఉంటే పక్కన పెట్టేస్తారు. కానీ ఇక్కడ ఒక ఆటగాడు మాత్రం  తన వయసును తక్కువగా చూపిస్తూ అండర్ 19 ప్రపంచ కప్ లో పాల్గొన్నాడు అంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఇది కాస్తా ప్రస్తుతం సంచలనంగా మారిపోయింది. ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు లో కొనసాగుతున్నాడు యువ ఆటగాడు రాజ్ వర్ధన్ హాంగార్కర్. ఇటీవలే అతనిపై మహారాష్ట్ర స్పోర్ట్స్  కమిషన్ సంచలన ఆరోపణలు చేసింది.

 ఇక ఇది కాస్త ప్రస్తుతం భారత క్రికెట్ లో సంచలనంగా మారిపోయింది. యువ ఆల్ రౌండర్ గా ఉన్న రాజ్ వర్ధన్  తన వయసును తక్కువగా చూపుతూ అండర్-19 ప్రపంచ కప్ లో పాల్గొన్నాడని మహారాష్ట్ర స్పోర్ట్స్ కమిషనర్ ఓంప్రకాష్ బకారియా ఆరోపించారు. ఈమేరకు భారత క్రికెట్ నియంత్రణ మండలి కార్యదర్శి జై షా కు లేఖ రాశారు ఓం ప్రకాష్ బకారియా. ఇలాంటి ఆటగాళ్ల వల్ల దేశ ప్రతిష్ట దెబ్బ తింటుందని అంటూ లేఖలో పేర్కొన్నారు. ఇక ఇలాంటి ఆటగాళ్లపై నిషేధం విధించాలి అంటూ కోరారు. అయితే అతని పై అటు బీసీసీఐ చర్యలు తీసుకోకపోవచ్చు అన్నది తెలుస్తుంది. ఎందుకంటే గతంలో బిసిసిఐ ప్రోటోకాల్ ప్రకారం వయసు నిర్ధారణ పరీక్షల్లో పాస్ అయ్యాడు సదరు ఆటగాడు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: