కోహ్లీ సెంచరీ.. అభిమానులు హ్యాపీ?

praveen
అతని పేరు విరాట్ కోహ్లీ.. ఇతనికి అభిమానులు పెట్టుకున్న ముద్దుపేరు రికార్డుల రారాజు.. మరికొంతమంది పిలుచుకునే నిక్ నేమ్ పరుగుల యంత్రం.. ఇక ఇతని పేరు చెబితే చాలు అందరికీ పూనకాలు వచ్చేస్తూ ఉంటాయి. ఎందుకంటే అతని ఆటతీరు అలా ఉంటుంది. విరాట్ కోహ్లీ ప్రపంచ క్రికెట్లో ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. అతను సాధించిన రికార్డులు అతని పేరును చెబుతుంటాయి.  ప్రస్తుతం ప్రపంచ క్రికెట్లో దిగ్గజ క్రికెటర్ గా కొనసాగుతున్న విరాట్ కోహ్లీ ఇండియా తరఫున అద్భుతమైన ప్రతిభ కనబరిచి ఎన్నో రికార్డులను కొల్లగొట్టాడు.


 ఇక కోహ్లీ ఎలా బ్యాటింగ్ చేసిన రికార్డులు మాత్రం అతనికి దాసోహం అయి పోతూ ఉంటాయి అని చెప్పాలి. అందుకే అతని అభిమానులు అందరూ రికార్డుల రారాజు అని పిలుస్తూ ఉంటారు. ఇకపోతే ఇటీవల కాలంలో మూడు ఫార్మాట్ల కెప్టెన్సీ నుంచి తప్పుకున్న విరాట్ కోహ్లీ ఎన్నో ఏళ్ల తర్వాత జట్టులో ఒక సాదాసీదా ఆటగాడిగా నే కొనసాగుతున్నాడు. రోహిత్ శర్మ కెప్టెన్సీలో ఆడుతున్నారు విరాట్ కోహ్లీ. అయితే ఇటీవలే మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. వెస్టిండీస్తో ప్రస్తుతం జరుగుతున్న రెండో వన్డే మ్యాచ్ లో కోహ్లీ కేవలం 18 పరుగులు మాత్రమే చేశాడు. అయినప్పటికీ అతని ఖాతాలో ఒక రికార్డు వచ్చి చేరింది.



 ఇక అభిమానులందరికీ కూడా సెంచరీ దాహం తీర్చాడు విరాట్ కోహ్లీ. అదేంటి 18 పరుగులు చేసాడు అంటున్నారు మరి సెంచరీ దాహం ఎలా తీరింది అనుకుంటున్నారు కదా.. వెస్టిండీస్తో అహ్మదాబాద్ వేదికగా జరిగిన రెండో వన్డే మ్యాచ్  విరాట్ కోహ్లీ స్వదేశంలో 100 వన్డే మ్యాచ్ కావడం గమనార్హం. ఇప్పటివరకు కెరీర్లో 258 వన్డే మ్యాచ్లు ఆడాడు విరాట్ కోహ్లీ. స్వదేశంలో 99 వన్డే మ్యాచ్లు ఆడాడు. ఇక నేడు జరుగుతున్న వన్డే మ్యాచ్ తో స్వదేశంలో వన్డే మ్యాచ్ లలో సెంచరీ కొట్టేసాడు కోహ్లీ. కోహ్లీ కంటే ముందు స్వదేశంలో 100 మ్యాచ్ లు ఆడిన వారిలో 35 మంది భారత క్రికెటర్లు మాత్రమే ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: