ఆయన మరణంతో సురేష్ రైనా ఇంట తీవ్ర విషాదం..!!

Divya
 క్రికెట్ చూసే ప్రేక్షకులకు సురేష్ రైనా తెలియని వారంటూ ఎవరూ ఉండరు. ఈయన టీమ్ ఇండియా తరఫున ఎన్నో మ్యాచ్లలో కీలకమైన సమయాలలో అద్భుతమైన ఆట ను ప్రదర్శించి విజయాలను అందించాడు. అయితే ఇప్పుడు తాజాగా సురేష్ రైనా ఇంట తీవ్ర విషాద చాయలు నెలకొన్నాయి.. తన తండ్రి త్రిలోక్ చంద్  కన్నుమూయడం జరిగింది.. దీంతో కుటుంబ సభ్యులు మొత్తం శోక సముద్రంలో మునిగిపోయారు..ఇక అందుకు సంబంధించి పూర్తి వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.
సురేష్ రైనా తండ్రి ఈరోజు కొద్ది గంటల క్రితం తుది శ్వాస విధించడం జరిగింది. సురేష్ రైనా తండ్రి మిలటరీ లో ఒక అధికారిగా పని చేసినట్లు తెలుస్తోంది. అది కూడా ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో బాంబులు తయారు చేసేటు వంటి అనుభవం కూడా ఆయనకు ఉన్నట్లుగా తెలుస్తోంది. త్రిలోక్ చంద్ గత పూర్వీకులు కూడా జమ్మూకాశ్మీర్లోని రైనావారి గ్రామంలో జన్మించిన వారు.1990 వ సంవత్సరంలో కాశ్మీరీ పండిట్ల హత్య ఘటన తర్వాత మీరు ఆ గ్రామాన్ని విడిచి పెట్టి వెళ్లారట. అలా వచ్చి వీరు ఉత్తర ప్రదేశ్లో మురాద్ నగర్ లో స్థిరపడడం జరిగినట్లు తెలుస్తోంది. ఇక ఆ సమయంలో తన తండ్రికి కేవలం 10 వేల రూపాయల జీతం మాత్రమే వచ్చేదట. ఇక దాంతోనే సురేష్ రైనాకు క్రికెట్ కోచింగ్, ఇతర ఫీజులకు డబ్బులు కట్టలేక పోయారట.

అందుచేతనే 1998వ సంవత్సరంలో గురు గోవింద్ అనే ఒక స్పోర్ట్స్ కళాశాలలో సురేష్ రైనాను చేర్పించారు. ఇక సురేష్ రైనా 2020 వ సంవత్సరంలో ధోనీతో పాటు ఒకేసారి రిటైర్మెంట్ ప్రకటించడం జరిగింది.. భారతదేశపు తరఫున 18 టెస్టులు,226 వన్డేలు, 79 t 20 లు ఆడినట్లు గా తెలుస్తోంది. ఇక ఐపీఎల్ తరఫున చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ సూపర్ జెయింట్స్ వంటి జట్లలో ప్రాతినిథ్యం వహించాడు. ఐపీఎల్ మొత్తానికి దాదాపుగా 200 కు పైగా మ్యాచ్లు ఆడి నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: