వావ్.. రిషబ్ పంత్ కు ప్రమోషన్?

praveen
భారత క్రికెట్లోకి మహేంద్రసింగ్ ధోని వారసుడిగా ఎంట్రీ ఇచ్చాడో రిషబ్ పంత్.  ధోని లాగానే మిడిల్ ఆర్డర్లో బ్యాటింగ్ చేయడమే కాదు కీపింగ్ కూడా చేస్తూ అదరగొట్టాడు. అయితే ఇటీవల కాలంలో జట్టులో కీలక ఆటగాడిగా కూడా రాణించాడు అన్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల విరాట్ కోహ్లీ టెస్ట్ కెప్టెన్సీ నుంచి తప్పుకున్న తర్వాత  కెప్టెన్ ఎవరు అయితే బాగుంటుంది అని చర్చ జరుగుతున్న సమయంలో యువ ఆటగాడు రిషబ్ పంత్ పేరు తెరమీదికి వచ్చింది. ఢిల్లీ కాపిటల్స్ కెప్టెన్గా సత్తా చాటిన రిషబ్ పంత్ కు కెప్టెన్సీ పగ్గాలు అప్పగిస్తే బాగుంటుంది అని ఎంతో మంది మాజీ ఆటగాళ్లు కూడా అభిప్రాయం వ్యక్తం చేశారు.

 వయసు, ఫిట్నెస్ దృశ్య రోహిత్ శర్మకు కాకుండా రిషబ్ పంత్ కు టెస్ట్ కెప్టెన్సీ అప్పగిస్తే అతను గొప్ప కెప్టెన్ గా ఎదుగుతాడు అని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇక ఇలాంటి పరిణామాల నేపథ్యంలో ఇక ఇప్పుడు రిషబ్ పంత్ కు ప్రమోషన్ వచ్చింది అని తెలుస్తోంది. మరికొన్ని రోజుల్లో వెస్టిండీస్తో వన్డే టి20 సిరీస్ లు ఆడబోతుంది టీమిండియా. అహ్మదాబాద్  వేదికగా తొలి వన్డే మ్యాచ్ ఫిబ్రవరి ఆరో తేదీ నుంచి ప్రారంభం కాబోతుంది. ఈ క్రమంలోనే తొలి వన్డేలో టీమిండియా పరిమిత ఓవర్ల వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ దూరమయ్యాడు. రెండో వైస్ కెప్టెన్ గా ఉన్న జస్ప్రిత్ బూమ్రా కు సెలెక్టర్లు ఇటీవల విశ్రాంతి ఇచ్చారు.

 దీంతో ఇక వైస్ కెప్టెన్ గా  ఎవరిని ఎంపిక చేస్తారు అన్న చర్చ మొదలయింది. ఈ నేపథ్యంలోనే తొలి వన్డేకు వైస్ కెప్టెన్గా వికెట్ కీపర్ రిషబ్ పంత్ కు అవకాశం ఇవ్వాలని బిసిసిఐ భావిస్తోందట. కాగా దక్షిణాఫ్రికా పర్యటన సమయంలో గాయం కారణంగా జట్టుకు దూరమైన రోహిత్ శర్మ ఇటీవలే మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చాడు. రెండో వన్డే మ్యాచ్ నుంచి కేఎల్ రాహుల్ జట్టులోకి రాబోతున్నాడు. ఈ క్రమంలోనే అటు మొదటి వన్డే మ్యాచ్ కి మాత్రమే అటు రిషబ్ పంత్ వైస్ కెప్టెన్గా ఎంపికయ్యాడు అని తెలుస్తోంది. రిషబ్ పంత్ కు వైస్ కెప్టెన్ గా ప్రమోషన్ రావడంతో అభిమానులు అందరూ ఆనందపడి పోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: