బాబోయ్.. ముంబై ఇండియన్స్ తో తెగదెంపులు?

praveen
బీసీసీఐ ప్రతి ఏడాది ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ జట్టు ప్రస్తుతం దిగ్గజ జట్టుగా కొనసాగుతోంది. ఏ జట్టుకు సాధ్యం కాని రీతిలో ఏకంగా అయిదు సార్లు టైటిల్ విజేతగా నిలిచింది ముంబై ఇండియన్స్ జట్టు. ప్రతిసారి భారీ అంచనాల మధ్య బరిలోకి దిగుతూ అంచనాలకు మించిన ప్రదర్శన చేస్తూ అదరగొడుతు ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఇలా ఏకంగా ఐపీఎల్ లో ఛాంపియన్ జట్టుగా కొనసాగుతుంది ముంబై ఇండియన్స్. ఇకపోతే మరికొన్ని రోజుల్లో 2022 ఐపీఎల్ సీజన్ ప్రారంభం కాబోతుంది అనుకుంటున్న సమయంలో ఇటీవలే ముంబై ఇండియన్స్ కు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.

 ప్రస్తుతం ఐపీఎల్ లో ఐదుసార్లు ఛాంపియన్గా నిలిచిన ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ తో ప్రముఖ ఎలక్ట్రానిక్ పరికరాల సంస్థ సాంసంగ్ తెగదెంపులు చేసుకుంది అన్నది తెలుస్తుంది. 2018 నుంచి టైటిల్ స్పాన్సర్గా ఉన్న సాంసంగ్ కంపెనీ కాంట్రాక్టు ఈ ఏడాది ముగిసింది. దీంతో ముంబై ఇండియన్స్ తో ఉన్న నాలుగేళ్ల బంధాలు తెంచు కోవడానికి సాంసంగ్ మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం ముంబై ఇండియన్స్ టైటిల్ స్పాన్సర్గా ఉన్న సాంసంగ్ తప్పుకోవడంతో ఆ క్రెడిట్ కార్డులు జారీచేసే ఒక స్టారటప్ కంపెనీ తో ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ డీల్ కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది.

 స్లైస్ కార్డ్స్ అనే పేరుతో ప్రస్తుతం మార్కెట్ లో దూసుకుపోతున్న స్టార్టప్ కంపెనీ ఇక వచ్చే మూడేళ్ల పాటు అటు ముంబై ఇండియన్స్ జట్టుకు టైటిల్ స్పాన్సర్గా నిలిచేందుకు సిద్ధమవుతుంది. ఇక దీనికిగాను ఏకంగా ముంబై ఇండియన్స్ కు 90 కోట్ల వరకు చెల్లించినట్లు తెలుస్తోంది. అయితే ఇక ప్రస్తుతం ఈ కొత్త ఒప్పందంతో ఇక నుంచి వచ్చే సీజన్లలో ముంబై ఇండియన్స్ జెర్సీ లపై సాంసంగ్ స్థానంలో కొత్త పేరు ఎంట్రీ ఇవ్వబోతోంది.. స్లైస్  అనే పేరు రాబోతుంది.  ఇకపోతే మొన్నటి వరకు పటిష్ఠంగా ఉన్న ముంబై ఇండియన్స్ జట్టు ఇక ఇప్పుడు మెగా వేలంలో ఏ ఆటగాళ్లను తీసుకోబోతోంది అన్నది ఆసక్తికరంగా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: