కేఎల్ రాహుల్ వికెట్.. వివాదంగా మారిందా?

praveen
క్రికెట్ మ్యాచ్ ఎంతో ఉత్కంఠ భరితంగా సాగుతున్న సమయంలో కొన్ని కొన్ని సార్లు బాధ్యతగా ఉండాల్సిన అంపైర్లు  పొరపాట్లు చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అంపైర్లు చేసే చిన్నపాటి పొరపాట్లు ఏకంగా మ్యాచ్ స్వరూపాన్నే మార్చేస్తూ ఉంటాయి. కొన్ని కొన్ని సార్లు నాటౌట్గా ఉన్న  సమయంలో వికెట్ ఇవ్వడం ఇక ఔట్ అయిన సమయంలో నాటౌట్ గా ప్రకటించడం లాంటివి కూడా చేస్తూ ఉంటారు.. ఇక ఇటీవల కాలంలో ఎంతోమంది అంపైర్లు  ఇలాంటి పొరపాట్ల కారణంగా సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో విమర్శలు పాలు అవుతున్నారు అన్న విషయం తెలిసిందే.



 ఇక ఇప్పుడు భారత్ సౌత్ ఆఫ్రికా మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్లో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. అంపైర్ చేసిన తప్పిదం కాస్త ప్రస్తుతం పెద్ద వివాదంగా మారి పోయింది అని చెప్పాలి. దక్షిణాఫ్రికా టీమిండియా మధ్య ఇటీవలే జోహన్నెస్బర్గ్ వేదికగా రెండవ టెస్ట్ మ్యాచ్ ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే ఈ టెస్ట్ మ్యాచ్లో భాగంగా రెండో రోజు ఆటలో ఇరు జట్ల కెప్టెన్లు మధ్య స్వల్ప వివాదం చెలరేగి నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం భారత కెప్టెన్గా కొనసాగుతున్న కేఎల్ రాహుల్ వికెట్ కోల్పోయిన తీరు వివాదానికి తెరలేపింది. రాహుల్ వికెట్ కోల్పోవడంతో అసహనంతో దక్షిణాఫ్రికా జట్టు కెప్టెన్ ఎల్గర్ తో వాగ్వాదానికి  దిగినట్లు వీడియో ఒకటి వైరల్ గా మారిపోయింది.


 ఇంతకీ అసలు ఏం జరిగిందంటే.. రెండో రోజు ఆట లో భాగంగా ఏడవ ఓవర్లో మార్కో జాన్సన్ వేసిన బంతిని షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు కె.ఎల్.రాహుల్. కానీ ఆ బంతి బ్యాట్ అంచును తాకుతూ సెకండ్ స్లిప్ లో ఉన్న  మార్కరం చేతుల్లోకి వెళ్లింది. ఇక అతను క్యాచ్ పట్టగానే దక్షిణాఫ్రికా జట్టు సంబరాల్లో మునిగి పోయింది..  అయితే మార్కరం క్యాచ్ అందుకున్న సమయంలో ముందుగా బంతి నేలను తాకింది అంటూ రాహుల్ మైదానాన్ని వీడేందుకు ఇష్టపడలేదు. ఫీల్డ్ అంపైర్లు చర్చించుకుని థర్డ్ అంపైర్ కి నివేదించారు. ఇక దీనిని  రివ్యూ లో చెక్ చేశారు ఈ క్రమంలోనే ముందు నుంచి చూసినప్పుడు బంతి కింద మర్కరం  వేళ్ళు ఉన్నట్లు కనిపించింది. మరో వైపు నుంచి బంతి కింద తగిలినట్లు కనిపించింది. దీంతో థర్డ్ అంపైర్   కూడా అవుట్ గా ప్రకటించడంతో రాహుల్ నిరాశగా వెనుదిరిగాడు. ఇక సీరియస్ గా మైదానం నుంచి నిష్క్రమించిన సమయంలో దక్షిణాఫ్రికా కెప్టెన్ ఎల్గర్ తో చిన్నపాటి గొడవ జరిగినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: