ధోనిలా ఉంటే.. కోహ్లీ పరుగులు చేసేవాడు కాదు : హర్భజన్
అయితే మిగతా ఆటగాళ్లలా మహేంద్ర సింగ్ ధోని భారీగా పరుగులు చేయక పోయినప్పటికీ.. జట్టుకు అవసరమైనప్పుడు మాత్రం ధోని ఎన్నోసార్లు పరుగులు చేసి గెలిపించాడు. అందుకేభారీ పరుగులతో ధోనీ రికార్డు సృష్టించక పోయినప్పటికీ అతనికి మాత్రం ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. అయితే మహేంద్ర సింగ్ ధోనీ తర్వాత టీమిండియా పగ్గాలు చేపట్టిన విరాట్ కోహ్లీ మాత్రం పరుగులు చేయడంతో రారాజు అని చెప్పాలి.ఇప్పటికే భారీగా పరుగులు చేసి ఎన్నో రికార్డులను బద్దలు కొట్టాడు. అంతే కాదు ఒక వైపు ధోనీ కాస్త నెమ్మదైన ఆటతీరు కేరాఫ్ అడ్రస్ అయితే.. కోహ్లీ మాత్రం ఎంతో దూకుడైన ఆటకు కేరాఫ్ అడ్రస్.
ఇటీవల ఇదే విషయంపై స్పందించిన టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీమ్ ఇండియా జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ తన దూకుడు కారణంగానే వేలాది పరుగులు చేయగలుగుతున్నాడు అంటూ హర్భజన్ సింగ్ చెప్పుకొచ్చాడు. ఒకవేళ మహేంద్ర సింగ్ ధోనీ లాగ మెతకగా ఉండి ఉంటే కోహ్లీ అన్ని పనులు చేసేవాడు కాదు అంటూ ఆసక్తికర వ్యాఖ్యలుచేశాడు. మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ టీమిండియాకు దూకుడును పరిచయం చేస్తే విరాట్ కోహ్లీ కి దానిని వేరే లెవెల్ కి తీసుకెళ్ళాడు అంటూ చెప్పుకొచ్చాడు అంటూ హార్భజన్ సింగ్ తెలిపాడు. కోహ్లీ దూకుడు కారణంగానే బాగా రాణించగలుగుతున్నాడు అంటూ చెప్పుకొచ్చాడు.