అందుకే టెంప్ట్ అవ్వలేదు : కేఎల్ రాహుల్

praveen
గత కొంత కాలం నుంచి అద్భుతమైన ఫామ్ లో కొనసాగుతున్నాడు కేఎల్ రాహుల్. ఫార్మాట్ తో సంబంధం లేకుండా ఇరగదీస్తున్నాడు అని చెప్పాలి. టీమిండియా విజయంలో కీలక పాత్ర వహిస్తున్నాడు. ప్రతి మ్యాచ్లో కూడా భారీ పరుగులు చేస్తూ దూసుకుపోతున్నాడు అని చెప్పాలి.  తనదైన శైలిలో ప్రదర్శన చేసి ఎన్నో రికార్డులు కూడా కొల్లగొట్టాడు. సౌత్ ఆఫ్రికా గడ్డపై కూడా ప్రోటీస్ బౌలర్లతో ఒక ఆటాడుకున్నాడు. ఎంతో మంది బ్యాట్స్ మెన్ లు సౌత్ఆఫ్రికా లో ఉన్న బౌన్సీ పిచ్లపై ఆడటానికి ఇబ్బంది పడితే కేఎల్ రాహుల్ మాత్రం ప్రతి బంతిని బౌండరీలు దాటించ గలిగాడు అని చెప్పాలి.

 అయితే ఏకంగా సౌత్ ఆఫ్రికా డబుల్ సెంచరీతో అదరగొట్టాడు. కేవలం ఇటీవలే సౌతాఫ్రికాలో మొదటి ఇన్నింగ్స్ లో సెంచరీ చేయడంతో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సెంచరీ సాధించినప్పుడు ఎన్నో భావోద్వేగాలు చుట్టుముడతాయి అంటూ చెప్పుకొచ్చాడు దాదాపు ఆరు నుంచి ఏడు గంటల పాటు క్రీజులో నిలబడి చిరస్మరణీయమైన ఇన్నింగ్స్ ఆడటం ఎంతో ప్రత్యేకమైనది అంటూ తెలిపాడు  తొలి రోజు ఆట ముగిసే సమయానికి అజేయంగా నిలవడం ఎంతో సంతోషాన్నిచ్చింది.  అంతేకాకుండా సెంచరీకి ఒక్క పరుగు దూరంలో ఉన్న సమయంలో కె.ఎల్.రాహుల్ ఎలాంటి ఆలోచనలు ఎదుర్కొన్నాడు అనే విషయాన్ని కూడా చెప్పుకొచ్చాడు.

 సెంచరీ చేయాలని ఆశ ప్రతి ఒక ఆటగాడి ఉంటుంది. కానీ ఒక్క పరుగు దూరంలో సెంచరీ మిస్ అయింది అంటే ఎంత బాధ పడాల్సి ఉంటుంది. సౌత్ ఆఫ్రికా లో జరిగిన మొదటి టెస్ట్ ఇన్నింగ్స్ లో సెంచరీ మిస్ చేసుకోవద్దని భావించాను. 99 పరుగుల వద్ద ఉన్నప్పుడు భారీ షాట్లు ఆడకుండా స్పిన్నర్ బౌలింగ్లో ఆచితూచి ఆడాలని అనుకున్నాను. ఇక్కడ షాట్ ఆడేందుకు టెంప్ట్ అవ్వకుండా ఆచితూచి వ్యవహరించి సెంచరీ పూర్తి చేశాను అంటూ చెప్పుకొచ్చాడు. ఇక తన ఇన్నింగ్స్ పట్ల ఎంతో సంతృప్తిగా సంతోషంగా ఉన్నాను అంటూ చెప్పుకొచ్చాడు కేఎల్ రాహుల్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: