75 లక్షలు అడ్వాన్స్.. నితిన్ మోసం చేశాడు.. నిర్మాత సంచలన వ్యాఖ్యలు వైరల్!

frame 75 లక్షలు అడ్వాన్స్.. నితిన్ మోసం చేశాడు.. నిర్మాత సంచలన వ్యాఖ్యలు వైరల్!

Reddy P Rajasekhar
టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపును సొంతం చేసుకున్న హీరోలలో నితిన్ ఒకరు. ఢీ, భగీరథ, బన్నీ సినిమాలను నిర్మించిన నిర్మాత సత్యనారాయణ రెడ్డి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. హీరో నితిన్ కు అడ్వాన్స్ గా 75 లక్షల రూపాయలు ఇస్తే చివరకు ఆ సినిమాను చేయబోమని చేతులు ఇచ్చేశామని ఆయన తెలిపారు. ఈయన కొడుకు వశిష్ట బింబిసార సినిమాతో భారీ సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే.
 
నితిన్ ఇష్క్ మూవీ రిలీజ్ సమయంలో నితిన్ తండ్రి ఆర్థికంగా ఇబ్బందులను ఎదుర్కొన్నాడని ఆయన చెప్పుకొచ్చారు. ఆ సినిమా రైట్స్ కొని వైజాగ్ లో డిస్ట్రిబ్యూషన్ చేశామని నేను, నితిన్ తండ్రి బాగా క్లోజ్ అని సత్యనారాయణ చెప్పుకొచ్చారు. నా కొడుకును నితిన్ కోసం కథ రాసుకోవాలని చెప్పానని నిర్మాతను కూడా సెట్ చేసి ఆ ప్రాజెక్ట్ కోసం రెండు కోట్ల రూపాయలు ఖర్చు చేయగా నితిన్ కు కథ నచ్చలేదని ఆయన తెలిపారు.
 
ఆ సమయంలో అ.ఆ మూవీ విడుదలై హిట్ గా నిలిచిందని ఆ సమయంలో కొత్త డైరెక్టర్ తో సినిమా వద్దని భావించారని ఆ డబ్బులు తిరిగి రాకపోవడం వల్ల మోసపోయామని చెప్పుకొచ్చారు. శ్రీరస్తు శుభమస్తు సినిమా హిట్టైన తర్వాత అల్లు శిరీష్ కూడా ఛాన్స్ ఇవ్వలేదని ఆయన తెలిపారు. ఆ సమయంలో అల్లు అరవింద్ సైతం తెగ ఫీలయ్యారని ఆయన కామెంట్లు చేయడం గమనార్హం.
 
ఆ సమయానికి మా వాడు చాలా బాధ పడుతూ ఉన్నాడని ఆయన కామెంట్లు చేశారు. డైరెక్షన్ వదిలేసి హీరోగా చేయాలని వశిష్టకు సూచించానని ఆయన వెల్లడించారు. హీరోగా లాంఛ్ చేస్తూ సినిమా మొదలుపెట్టగా అది వర్కౌట్ కాదని అనుకున్నామని ఆయన చెప్పుకొచ్చారు. ఆ తర్వాత ఆ సినిమా వదిలేసి డైరెక్షన్ పై ఫోకస్ పెట్టారని ఆయన తెలిపారు. ఆయన వెల్లడించిన విషయాలు వైరల్ అవుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: