కేఎల్ రాహుల్ రాణిస్తే.. అతను జట్టునుండి ఔట్?

praveen
ఇటీవలే టీమిండియా జట్టు దక్షిణాఫ్రికా పర్యటనకు బయలుదేరింది. ఇక దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా ఇద్దరు కెప్టెన్లు మొదటిసారి టీమిండియాకు ప్రాతినిధ్యం వహించ పోతున్నారు. అటు టెస్టు జట్టుకు విరాట్ కోహ్లీ కెప్టెన్సీ వహిస్తుండగా సౌతాఫ్రికా జట్టుతో తలపడనున్న వన్డే జట్టుకు రోహిత్ శర్మ కెప్టెన్సీ బాధితులు నిర్వహిస్తున్నాడు. ముఖ్యంగా సౌత్ ఆఫ్రికా లో టీమిండియా ఆడుతున్న టెస్ట్ సిరీస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా మారిపోయింది. ఎందుకంటే ఇప్పటివరకూ ఏ భారత కెప్టెన్ కూడా సౌత్ ఆఫ్రికా టెస్ట్ సిరిస్ గెలిపించిన దాఖలాలు లేవు. టీమిండియా ఒక్కసారి కూడా సౌత్ ఆఫ్రికా పర్యటనలో టెస్టు సిరీస్ గెలవలేదు.

 ఈ క్రమంలోనే ప్రస్తుతం ఎంతో పటిష్టంగా కనిపిస్తున్న కోహ్లీసేన సౌత్ ఆఫ్రికా పర్యటనలో టెస్ట్ సిరీస్ విజయం సాధించి సరికొత్త చరిత్రకు నాంది పలుకుతుంది భారత క్రికెట్ ప్రేక్షకులందరూ అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే ఇక టీమ్ ఇండియా సౌత్ ఆఫ్రికా పర్యటనపై  మాజీ ఆటగాళ్లు కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తూ ఉండటం గమనార్హం. ఈ క్రమంలోనే టీమిండియా మాజీ ఆటగాడు. ప్రముఖ కామెంటేటర్ ఆకాశ్ చోప్రా  సౌత్ ఆఫ్రికా పర్యటన పై స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీమిండియాలో పరిస్థితులు పూర్తిగా మారిపోతున్నాయి అంటూ ఆకాశ్ చోప్రా అభిప్రాయం వ్యక్తం చేశాడు.  ఇటీవలే టెస్ట్ సిరీస్లో భాగంగా వైస్ కెప్టెన్ గా ఎన్నికైన రోహిత్ శర్మ గాయం బారినపడి దూరం కావడంతో కేఎల్ రాహుల్ ని సెలెక్ట్ చేసి వైస్ కెప్టెన్ గా నియమించారు.

 దీంతో ఎన్నో రోజుల నుంచి టెస్ట్ క్రికెట్లో టీమిండియా కెప్టెన్గా బాధ్యతలు నిర్వహించిన అజింక్య రహానే పై ఎంతగానో ఒత్తిడి పెరిగిపోయే అవకాశం ఉంది. అయితే కేఎల్ రాహుల్ అటు పరిమిత ఓవర్ల క్రికెట్లో కూడా వైస్ కెప్టెన్గా ఎంపిక అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అంటూ ఆకాశ్ చోప్రా చెప్పుకొచ్చాడు.. రాహుల్ ను వైస్ కెప్టెన్ గా నియమించడం. ఇక టీమిండియాకు కొత్త కొత్తగా రాహుల్ ద్రవిడ్ రావడం... మరోవైపు రోహిత్ ఇటీవలే పూర్తిగా పరిమిత ఓవర్ల క్రికెట్కు సారథ్య బాధ్యతలు చేపట్టడం ఇక ఇవన్నీ మార్పులు చూస్తుంటే రానున్న రోజుల్లో పరిమిత ఓవర్ల క్రికెట్లో వైస్ కెప్టెన్ గా కె.ఎల్.రాహుల్ ఎంపిక అవుతాడని బలంగా నమ్ముతున్నాను అంటూ చెప్పుకొచ్చాడు. అయితే ఒకవేళ టెస్టుల్లో కె.ఎల్.రాహుల్ క్లిక్ అయ్యారు అంటే అజింక్యా రహానే జట్టులో స్థానం కోల్పోయినట్లే అంటూ ఆకాష్ చోప్రా చెప్పుకొచ్చాడు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: