ఇకపై నేను ఆడకపోవచ్చు.. షాకిచ్చిన స్టార్ క్రికెటర్?

praveen
ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ కి ఎంత గుర్తింపు ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. క్రికెట్ మ్యాచ్ వస్తుందంటే చాలు ప్రేక్షకులు టీవీలకు అతుక్కుపోయి మరి మ్యాచ్ వీక్షిస్తూ ఉంటారు. అయితే క్రికెట్ లో  ఎప్పుడు కొత్త ఆటగాళ్లు వస్తూ ఉండడం గమనార్హం. ఇలాంటి సమయంలోనే సీనియర్ క్రికెటర్లకీ జట్టులో స్థానం దొరకడం కూడా ఎంతో కష్టం గా మారిపోతూ ఉంటుంది. అయితే క్రికెట్ జట్టులో స్థానం సంపాదించుకోవాలి అంటే ప్రతి ఆటగాడు కూడా ఎప్పుడూ ఫామ్ కోల్పోకుండా రాణిస్తూనే ఉండాలి. అయితే ఒక్కసారి ఫామ్ కోల్పోయి ఇబ్బందిపడ్డాడు అంటే ఇక స్టార్ క్రికెటర్ అయినా సరే ఆ జట్టు నుంచి పక్కన పెట్టడానికి ఏమాత్రం మొహమాట పడరు సెలెక్టర్లు.

 ఇలా ఫామ్  కోల్పోయి ఎంతో మంది క్రికెటర్లు జట్టులో స్థానం కోల్పోయిన వారు కూడా ఉన్నారు. ఇక ఆ తర్వాత మళ్లీ అవకాశాలు రాక చివరికి రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్లు కూడా ప్రపంచ క్రికెట్ లో చాలామంది ఉన్నారు అని చెప్పాలి. అయితే ప్రస్తుతం దక్షిణాఫ్రికా జట్టులో సీనియర్ ప్లేయర్గా కీలక ఆటగాడిగా కొనసాగుతున్నాడు క్రిస్ మోరిస్. ఈ ఆటగాడు ఒక్కసారి మైదానంలో కుదురుకున్నాడు అంటే మ్యాచ్ స్వరూపాన్ని మార్చగల సత్తా అతని సొంతం అని చెప్పాలి. ఇలాంటి స్టార్ ప్లేయర్ గత కొంతకాలంగా ఫామ్ను కోల్పోయి తెగ ఇబ్బందులు పడుతున్నాడు. ఇటీవలే ఐపీఎల్ లో భాగంగా రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడిన క్రిస్ మోరిస్ తన సత్తా చాటలేక ప్రదర్శనతో నిరాశపరిచాడు.

 ఇక మరోసారి తమ అభిమాన క్రికెటర్ క్రిస్ మోరిస్ మళ్ళీ మునుపటి ఫామ్ లోకి వచ్చి రాణిస్తాడు అని అభిమానులు భావిస్తున్నప్పటికీ ఇటీవలే ఊహించని ప్రకటన చేసాడు. భవిష్యత్తులో తాను దక్షిణాఫ్రికా జట్టు తరఫున ఆడలేకపోవచ్చు అంటూ ఈ ఆల్ రౌండర్ వ్యాఖ్యానించాడు.  తాను అధికారికంగా రిటైర్మెంట్ ప్రకటించక పోయినప్పటికీ దేశానికి ప్రాతినిథ్యం వహించడం మాత్రం కష్టమే అంటూ చెప్పేసాడు. ఈ విషయమై దక్షిణ ఆఫ్రికా క్రికెట్ బోర్డుకు తనకు కూడా పూర్తి స్థాయి క్లారిటీ ఉంది అంటూ తెలిపాడు. ఇన్నాళ్ళ వరకు దేశం తరఫున ఆడినందుకు ఎంతో గర్వంగా ఫీలవుతున్నాను అంటున్నాడు క్రిస్ మోరిస్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: