నా ఫేవరెట్ టీమిండియానే : స్టివ్ స్మిత్

praveen
మరికొన్ని రోజుల్లో టి20 వరల్డ్ కప్ ప్రారంభం కాబోతుంది. ఈ క్రమంలోనే క్రికెట్ ప్రేక్షకులందరికీ అసలు సిసలైన క్రికెట్ ఎంటర్టైన్మెంట్ అందుతోంది. ఇక వరల్డ్ కప్ కోసం అన్ని జట్లు సిద్ధమయ్యాయి.  ఎన్నో ఏళ్ల నుంచి వరల్డ్ కప్ లో  చివరి వరకు వెళ్లి చివర్లో తడబడుతూ వరల్డ్ కప్ గెలవలేక పోతుంది టీమిండియా జట్టు. కానీ ఈ సారి మాత్రం తప్పనిసరిగా వరల్డ్ కప్ గెలవాలి అనే కసితో బరిలోకి దిగబోతోంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం టి20 వరల్డ్ కప్  లో టీమిండియా ప్రదర్శన ఎలా ఉండబోతోంది అనే దానిపై రోజురోజుకు అంచనాలు పెరిగి పోతూనే ఉన్నాయి.  అయితే ప్రస్తుతం జరుగుతున్న వార్మప్ మ్యాచ్లో టీమిండియా అద్భుతంగా రాణిస్తోంది  అని చెప్పాలి.

 ఇటీవల జరిగిన వార్మప్ మ్యాచ్లో ఇంగ్లండ్ జట్టుపై విజయం సాధించిన టీమిండియా ఇక ఇటీవలే ఆస్ట్రేలియా జట్టుపై కూడా ఘన విజయాన్ని సాధించిందన్న విషయం తెలిసిందే. ఏకంగా తొమ్మిది వికెట్ల తేడాతో విజయం సాధించింది.  టీమిండియా ఇదే ప్రదర్శన కొనసాగిస్తూ దూసుకుపోతే ఇక తిరుగులేదు అని మాజీ క్రికెటర్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే కేవలం భారత మాజీ క్రికెటర్లే కాదు అటు ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ స్టీవ్ స్మిత్ సైతం భారత జట్టు పై ప్రశంసలు కురిపించాడు. ఈసారి టి20 వరల్డ్ కప్ లో టీమిండియానే ఫేవరేట్ అంటూ చెప్పుకొచ్చాడు.

 ఒక ఆస్ట్రేలియన్ క్రికెటర్ తమ జట్టుని కాకుండా ఏకంగా భారత జట్టును ఫేవరెట్ అనడం మాత్రం ప్రస్తుతం భారత అభిమానులను తెగ మురిసిపోయేలా చేస్తుంది. కాగా నిన్న ఆస్ట్రేలియా భారత జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో  48 బంతుల్లో 57 పరుగులు చేశాడు స్మిత్.  ఈ క్రమంలోనే మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు భారత జట్టు ముందు 153 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఈ క్రమంలోనే ఏకంగా ఒకే ఒక వికెట్ కోల్పోయి 17.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి ఘన విజయాన్ని సాధించింది టీమిండియా జట్టు. మొత్తంగా టీమిండియాలో బౌలింగ్ విభాగం బ్యాటింగ్ విభాగం ఎంతో పటిష్టంగా కనిపిస్తుంది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: