నేను తప్పుకుంటున్నా.. ఊహించని షాకిచ్చిన క్రిస్ గేల్?
ప్లే ఆఫ్ కి అర్హత సాధించడానికి ఎంతో కష్టపడాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇలాంటి సమయంలో ఇటీవలే పంజాబ్ కింగ్స్ జట్టుకి ఊహించని షాక్ తగిలింది. ఏకంగా పంజాబ్ జట్టులో కీలక ఆటగాడిగా ఉన్న క్రిస్ గేల్ తాను జట్టుని వీడుతున్నట్లు ఇటీవలే ప్రకటించి షాకిచ్చాడు. ఇక క్రిస్ గేల్ తీసుకున్న అనూహ్య నిర్ణయం అందరినీ అవాక్కయ్యేలా చేసింది. అయితే నేడు కోల్కతా నైట్ రైడర్స్ తో కీలక మ్యాచ్ ఆడాల్సి ఉంది పంజాబ్ కింగ్స్ జట్టు. ఈ మ్యాచ్ ముంగిట తాను జట్టుని వీడుతున్నాను అంటూ ప్రకటించాడు. దీంతో అభిమానులు అందరిలో కూడా ఆందోళన మొదలైంది.
కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ఏర్పాటుచేసిన బయో బబుల్ లో ఉండి విసిగిపోయి ఈ నిర్ణయం తీసుకున్నాను అంటూ గేల్ స్పష్టం చేశాడు. 2021 సీజన్లో ఇప్పటివరకు 10 మ్యాచులు ఆడిన గేల్ 125 స్ట్రైక్ రేట్ కలిగి ఉన్నాడు. అయితే ఈ ఐపీఎల్ సీజన్ లో ఒక్కసారి కూడా క్రిస్ గేల్ హాఫ్ సెంచరీ నమోదు చేయకపోవడం గమనార్హం. ఇక మరోవైపు 2021 ఐపీఎల్ సీజన్ లో ఇప్పటి వరకు 11 మ్యాచ్లు ఆడిన పంజాబ్ కింగ్స్ జట్టు కేవలం నాలుగు మ్యాచ్ల్లో మాత్రమే విజయం సాధించింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో ఉంది.