ఐపీఎల్ ముంగిట ఫాన్స్ కి గుడ్ న్యూస్.. ధోని భారీ సిక్సర్లు?

praveen
ఇప్పటి వరకు ఐపీఎల్ చరిత్రలో తిరుగులేని జట్టుగా మూడుసార్లు టైటిల్ విజేతగా నిలిచి.. దూసుకుపోతుంది చెన్నై సూపర్ కింగ్స్ జట్టు. ఇక ఈ సారి ఎట్టి పరిస్థితుల్లో టైటిల్ గెలవడమే లక్ష్యంగా వ్యూహాలను అమలు చేస్తుంది. ధోనీ సారథ్యంలోని ఆటగాళ్లందరూ ప్రస్తుతం ఎంతో పటిష్టంగానే కనిపిస్తున్నారు. ఇక రెండవ దశ ఐపీఎల్ కోసం అన్ని జిల్లాల కంటే ముందు యూఏఈ చేరుకుని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ప్రస్తుతం ప్రాక్టీస్ లో మునిగి తేలుతుంది.  ఇక ధోని రెండవ దశలో అదరగొట్టెందుకు పూర్తిస్థాయి సమయాన్ని ప్రాక్టీస్కు కేటాయిస్తున్నట్లు తెలుస్తోంది.

 ధోనీ ఒక్కసారి మైదానంలో కుదురుకున్నాడు అంటే ఎంత అద్భుతమైన సిక్సర్లు కొడతాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏకంగా ప్రత్యర్థి బౌలర్లు భయపడే రేంజ్ లో మహేంద్ర సింగ్ ధోని విజృంభిస్తు ఉంటాడు. కానీ గత కొన్ని రోజుల నుంచి మహేంద్రసింగ్ ధోని అసలు సిసలైన బ్యాటింగ్ చూడలేకపోతున్నారు అభిమానులు. ఇక ఈ రెండవ దశలో మాత్రం ధోని అభిమానులందరికీ పండగే అన్నది తెలుస్తుంది. ఎందుకంటే ఇక ఐపీఎల్ ప్రారంభానికి ముందు హిట్టింగ్ ప్రాక్టీస్ చేస్తున్నట్లు తెలుస్తోంది. రెండవ దశలో భాగంగా మొదటి మ్యాచ్లో ముంబై ఇండియన్స్ తో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తలపడుతుంది.

 ఈ క్రమంలోనే చెన్నై సూపర్ కింగ్స్ జట్టు లోని కెప్టెన్ ధోనీతో పాటు టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్ కూడా భారీ సిక్సర్లను ప్రాక్టీస్ చేస్తున్నారట. మరీ ముఖ్యంగా మహేంద్రసింగ్ ధోని కొడుతున్న సిక్సర్లతో బౌలర్లు ఒత్తిడికి గురవుతున్న ట్లు ఆ జట్టు ఫాస్ట్ బౌలర్ దీపక్ చాహర్ వెల్లడించారు. ఇటీవలే ప్రాక్టీస్ సెషన్ లో  భాగంగా మహేంద్రసింగ్ ధోని కి బౌలింగ్ చేసిన దీపక్ చాహర్ అనంతరం మీడియాతో మాట్లాడారు. మహి భాయ్ నిజంగా భారీ సిక్సర్లు కొడుతున్నాడు. అతను ఒక్కడే కాదు టీం లోని అందరూ భారీ షాట్లు ఆడుతున్నారు. దీంతో వారికి బౌలింగ్ చేయడానికి చెన్నై సూపర్ కింగ్స్ జట్టు లోని బౌలర్ పై ఒత్తిడి పెరుగుతుంది అంటూ చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: